మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సినిమా 'కడువా' (Kaduva Telugu Movie). మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జూన్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే... ఇప్పుడు ఆ రోజు సినిమా విడుదల కావడం లేదు. ఓ వారం వెనక్కి వెళ్ళింది. 'కడువా'ను జూలై 7న విడుదల చేయనున్నట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
''మన కలలు ఎంత పెద్దవి అయితే... మనకు ఎదురయ్యే అడ్డంకులు అంత పెద్దగా ఉంటాయి. శత్రువులు బలవంతులు అయితే మనం గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. అనివార్య కారణాల వల్ల 'కడువా'ను ఒక వారం వాయిదా వేయాల్సి వచ్చింది. జూలై 7న విడుదల (Kaduva Movie Latest Release Date) చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి రెడీ అయిన థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లకు, అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నా'' అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.
Also Read : రేప్ కేసులో విజయ్ బాబును అరెస్ట్ చేసిన పోలీసులు
'కడువా' సినిమాలో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులోనూ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.