మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చి దగ్గర ఉన్న కలమస్సెర్రీలోని తన ఇంటి ముందు ఉన్న చెట్టుకి ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. జూన్ 25న సాయంత్రం ప్రసాద్ చెట్టుకి వేలాడుతూ కనిపించడం చూసిన ఆయన పిల్లలు వెంటనే పొరిగింటి వాళ్లకు విషయం చెప్పారు. వాళ్లు అక్కడకి వచ్చి ప్రసాద్ ను చెట్టు నుంచి కిందకు దించారు.
అతడిని పరీక్షించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు తేలింది. కుటుంబ కలహాలు, డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మాట్లాడిన ఓ పోలీస్ ఉన్నతాధికారి.. ప్రసాద్ కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రసాద్ భార్య అతడితో గొడవ పడి కొన్ని నెలలుగా దూరంగా ఉంటుంది. సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి అతడు చాలా డిప్రెషన్ లో ఉన్నట్లు తేలింది.
కొన్నేళ్ల క్రితం ప్రసాద్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లో అతడి వద్ద సింథటిక్ డ్రగ్స్ దొరికాయి. సినిమాల్లోకి రాకముందే అతడిపై చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికొస్తే.. మలయాళంలో అతడు చాలా సినిమాలు చేశారు. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కిన 'యాక్షన్ హీరో బిజు'తో ప్రసాద్ కి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు అయన సూసైడ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్