మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబును సోమవారం కేరళలోని కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. తనను విజయ్ బాబు లైంగింకగా వేధించడంతో పాటు అత్యాచారం చేశాడని యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. అసలు, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే...


విజయ్ బాబు మీద యువ నటి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను జూన్ 22 అరెస్ట్ చేశారు. అయితే, కేరళ హైకోర్టు యాంటిసిపేటరీ (ముందస్తు) బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ స‌బ్‌మిట్‌ చేయమనడంతో పాటు రాష్ట్రం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అయితే... సోషల్ మీడియాలో బాధిత మహిళ పేరును విజయ్ బాబు వెల్లడించిన కారణంగా మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాల్లో వినిపించింది. అందుకు తగ్గట్టు... విచారణ నిమిత్తం సోమవారం ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన విజయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.


ఆధారాలు సేకరణకు అత్యాచారం జరిగిన ప్రదేశాలకు విజయ్ బాబును తీసుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. జూన్ 27 నుంచి జూలై 3 వరకూ... ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విజయ్ బాబును ప్రశ్నించడానికి హైకోర్టు నుంచి పోలీసులకు అనుమతి లభించింది. 


Also Read : థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్


ఏప్రిల్ 27న విజయ్ బాబు మీద కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. అరెస్ట్ నుంచి కేరళ హైకోర్టు రక్షణ కల్పించడంతో  మే చివరి వారంలో కొచ్చి వచ్చారు. 



Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్