రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన ప్రభాస్ రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనను అభిమానుల నుంచి సెలబ్రిటీలు దాకా అందరూ సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ కు సంబంధించిన పలు అప్డేట్లు రిలీజ్ అవుతుండగా, వాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన 'ది రాజా సాబ్' కొత్త పోస్టర్ లో ఆయన పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఆ గ్లాసెస్ బ్రాండ్ తో పాటు వాటి కాస్ట్ ఎంత అన్న విషయం కూడా తాజాగా వెళ్లడైంది. 


కాస్ట్ లీ సన్ గ్లాసెస్ తో స్టైలిష్ లుక్ లో.. 


మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, యోగి బాబు, అనుపమ్ ఖేర్, సంజయ్ దత్ వంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆయన పుట్టినరోజుకు రెండ్రోజుల ముందే 'ది రాజా సాబ్' మూవీ నుంచి ఒక స్టైలిష్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ప్రభాస్ గళ్ళ చొక్కా నల్ల ప్యాంటు ధరించి కూల్ గా స్టైలిష్ గా కనిపించారు. ఇక ఆయన పెట్టుకున్న సన్ గ్లాసెస్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. 



ఆ పోస్టర్లో ప్రభాస్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ మామూలువి కాదు. లూయిస్ విట్టన్ అనే అత్యంత కాస్ట్లీ బ్రాండ్ కు సంబంధించిన సన్ గ్లాసెస్. వీటి ధర అక్షరాల రూ. 88,000 అని తెలుస్తోంది. లగ్జరీ ఫ్యాషన్ లో ప్రత్యేకమైన అభిరుచి కనబరిచే ప్రభాస్ ఎప్పటికప్పుడు ఇలా ఖరీదైన వాచ్ లు, బట్టలు, సన్ గ్లాసెస్ వంటివి పెట్టుకుని అభిమానులను ఆశ్చర్యపరుస్తారు. ఇక 'మిర్చి' తరువాత ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమాలోనే హ్యాండ్సమ్ ఆ కన్పించబోతున్నారు. అలాగే ఇదే ఆయన కెరీర్ లో ఫస్ట్ హారర్ మూవీ. ఈ సినిమా రిలీజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 


Also Readఅల్లు అర్జున్ రూటులో బాలీవుడ్ స్టార్... 10 కోట్లు ఇస్తామన్నా అటువంటి యాడ్ చేయడానికి 'నో' చెప్పేశాడు, అతను ఎవరో తెలుసా?



చేతి నిండా సినిమాలతో బిజీ


ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నారు. 'ది రాజా సాబ్' మూవీ తర్వాత ఆయన 'సలార్ పార్ట్ 2 : శౌర్యంగ పర్వం'లో మరోసారి దేవా పాత్రను పోషించబోతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమాలో నటించబోతున్నారు. ఇందులో ఆయన మొట్టమొదటిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అలాగే మరో పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 2025లో ప్రభాస్ 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు.


Read Also : Bigg Boss Telugu season 8 episode 51 review : లవ్ బర్డ్స్ ను విడగొట్టిన ప్రేరణ, యష్మి గౌడ... విష్ణు స్నేక్ అంటూ పృథ్వీకి క్లాస్ - భారీగా ప్రైజ్ మనీ డ్రాప్