స్టార్ హీరోలకు ప్రేక్షకులను విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. తమ అభిమాన హీరో ఏది చేస్తే తాము కూడా అది చేయాలని ట్రై చేసే డై హార్ట్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉంటారు. అందుకోసమే హీరోలకు కోట్లకు కోట్ల రూపాయలు ఇచ్చి తమ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేయించుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. అయితే డబ్బు కోసం హీరోలు ఏదైనా చేస్తారనేది అనుకోవడం అపోహ. కొంతమంది హీరోలు లిక్కర్, పాన్, కూల్ డ్రింక్స్ అంటే యాడ్ చేయడానికి 'నో' చెబుతారు. ఆ లిస్టులో ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో చేరారు. 


అల్లు అర్జున్ రూటులో అనిల్ కపూర్!
అనిల్ కపూర్... హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా తెలిసిన బాలీవుడ్ స్టార్ హీరో. ఇప్పుడు ఆయన వయసు 67 సంవత్సరాలు. అయితే... అందం విషయంలో యంగ్ హీరోలకు ఎప్పుడు కాంపిటీషన్ ఇస్తూనే ఉన్నారు. హృతిక్ రోషన్ 'ఫైటర్', రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమాల్లో ఆయన నటన ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రజల్లో ఆయనకు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవాలని ఒక పాన్ మసాలా సంస్థ భావించింది. తమ పాన్ మసాలా యాడ్ చేయమని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళింది. అయితే అనిల్ కపూర్ నో చెప్పేశారు.


కోటి, రెండు కోట్ల కాదు... ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మసాలా ఆ పాన్ మసాలా సంస్థ ఆఫర్ చేసినా సరే... అనిల్ కపూర్ ససేమిరా చేయనంటే చేయనని చెప్పడంతో బాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈ మేటర్ హాట్ టాపిక్ అయింది.


Also Read: 'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!






అనిల్ కపూర్ కంటే ముందు ఆ ఆఫర్ మన టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది. ఆయన కూడా ఆ పాన్ మసాలా యాడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ సంస్థ ఇచ్చిన డబ్బు కంటే తనకు ప్రేక్షకులలో గౌరవం ముఖ్యం అని, తాను యాడ్ చేయడం వల్ల ప్రజలు చెడు అలవాట్ల వైపు అడుగులు వేయడం తనకు నచ్చదని చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ రూటులో అనిల్ కపూర్ కూడా వెళ్లారు.


Also Read: ఓటీటీలోకి ఈ వారమే 'సత్యం సుందరం'... రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌



బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కన్నడ స్టార్ - 'కేజిఎఫ్' సినిమాలో రాఖీ బాయ్ పాత్రలో ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ఒకప్పటి నటి బీజేపీ నేతృత్వంలో మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ, పంజాబీ నటుడు అమీ విర్క్, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం సైతం పాన్ మసాలా యాడ్ చేయడానికి నో చెప్పారు.


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ విషయంలో నెటిజనుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన ఒక పాన్ మసాలా సంస్థ రూపొందించిన వాణిజ్య ప్రకటనలో నటించారు. ఆయన ఒక్కరే కాదు... అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ సైతం ఆ యాడ్ చేశారు. దాంతో వాళ్ల మీద కొంత మంది నెటిజనులు తీవ్ర విమర్శలు చేశారు. డబ్బులు ఇస్తే ప్రజల ఆరోగ్యాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని అటువంటి యాడ్స్ చేస్తారని దుమ్మెత్తి పోశారు. ఆ విమర్శలు పట్టించుకోకుండా ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఆ యాడ్స చేస్తున్నారు.