Preity Zinta recalls Dil Se Memories: 'దిల్ సే'.. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్. బాక్సాఫీస్ దగ్గర అంతగా రానించలేదు కానీ.. జనాల మదిలో మాత్రం అలా నిలిచిపోయిన సినిమాల్లో 'దిల్ సే' ఒకటి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు. అయితే, ఆ సినిమా చేస్తున్నప్పటి మెమోరీస్ ని పంచుకున్నారు ప్రీతి జింతా. మణి సార్‌తో వర్క్ చేయడం నిజంగా ఎక్సైటెడ్ గా అనిపించిందని అన్నారు. ఇక 'దిల్ సే' షూటింగ్ ఫస్ట్ రోజు దిగిన ఫొటోను షేర్ చేసిన ఆమె.. ఆసక్తికర విషయాలు పోస్ట్ చేశారు.
జోక్ చేస్తున్నారు అనుకున్నాను...
'దిల్ సే' సినిమాలో తాను మేకప్ లేకుండా నటించానని చెప్పారు ప్రీతి జింతా. డైరెక్టర్ తనను మేకప్ తీసేయమని చెప్పారని, ఫ్రెష్ ఫేస్ తో షూటింగ్ చేశారని అన్నారు. దానికి సంబంధించి ఫొటోను షేర్ చేశారు. ప్రీతి. షూటింగ్ మొదటిరోజు ఈ ఫొటో తీశారు. "మణిరత్నం సార్, షారుఖ్ ఖాన్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. అలా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన వెంటనే మణిసార్ నాకు షాక్ ఇచ్చారు. ఫేస్ వాష్ చేసుకోమన్నారు. సార్ మేకప్ పోతుంది కదా? అంటే.. "అవును మేకప్ లేకుండా, ఫ్రెష్ ఫేస్ తో షూట్ చేద్దాం" అని చెప్పి.. మేకప్ లేకుండానే షూట్ చేశారు " అని తను పోస్ట్ చేసిన క్యూట్ ఫొటో కింద రాసుకొచ్చారు ప్రీతి.
థ్యాంక్యూ సంతోషి శివన్...
ఈ సందర్భంగా ఆమె మరొకరిని కూడా గుర్తు చేసుకున్నారు. ఆయనే సినిమాటోగ్రఫర్ సంతోషి శివన్. మేకప్ లేకపోయిన తనని చాలా అందంగా చూపించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఫ్రెష్ ఫేస్ తో షూట్ చేసినా చాలా అందంగా కనిపించేలా చేసిన అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ సంతోషి శివన్. 'దిల్ సే' సినిమాకి ఆయనే అనుకుంటా నా సీన్స్ షూట్ చేసింది.. అని అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు ప్రీతి. ఆమె క్యూట్ ఫొటో చూసిన ఫ్యాన్స్ ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇప్పటికీ ఫేమస్..
1998 లో విడుదలైన 'దిల్ సే' సినిమా ఇప్పటికీ ఎంతోమంది మదిలో నిలిచిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రీతి జింతా హీరోయిన్ కాగా.. షారుక్ ఖాన్ హీరోగా నటించారు. ఈ సినిమాలో షారుక్ రేడియో జాకి. ప్రీతి జింతాతో పాటు.. మనీష కోయిరాలా కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమె టెర్రరిస్ట్ గా నటించారు. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని జియా జెలే జాన్ జెలే పాటకు అయితే ఇప్పటికీ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ హిట్ సాంగ్స్ లో ఈ పాట టాప్ అనే చెప్పొచ్చు.
ప్రీతి జింతా బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్. ఆమె తెలుగులో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు ఆమెకి. ఇక ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితం అయ్యారు ప్రీతి. ఇక 2016లో అమెరికన్ అయిన జీన్ గుడెనఫ్‌ని లాస్ ఏంజలస్‌లో పెళ్లి చేసుకుంది. అప్పట్నించి భర్తతో పాటూ అక్కడే సెటిలైంది. సినిమాలకు కూడా దూరంగా ఉంటోంది. ఆమెకు కొడుకు జై జింతా గుడెనఫ్, కూతురు జియా జింతా గుడెనఫ్. కాగా.. వాళ్లకు ప్రీతి సరోగేట్ మదర్.
Also Read: 'ఈగల్' ఆడియన్స్ రివ్యూ: ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే... సినిమా హిట్టా? ఫట్టా?