రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఎట్ ద సేమ్ టైమ్... మరొక బ్యాడ్ న్యూస్! ఆ రెండూ 'ది రాజా సాబ్' (The Raja Saab) టీజర్ రిలీజ్ గురించి! డేట్ ఫిక్స్ కావడం గుడ్ న్యూస్ అయితే... కాస్త వెయిట్ చేయాల్సి రావడం బ్యాడ్ న్యూస్! ఆ వెయిటింగ్ పీరియడ్ తక్కువే. అసలు విషయంలోకి వెళితే...
జూన్ 16న 'ది రాజా సాబ్' టీజర్ రిలీజ్!Prabhas and Maruthi's The Raja Saab Teaser Release Date: కథానాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ ఒక్క హారర్ సినిమా కూడా చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్... మారుతీ దర్శకత్వంలో ఆయన ఒక హారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రమే 'ది రాజా సాబ్'.
జూన్ 16వ తేదీన 'ది రాజా సాబ్' టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ పరిచయం చేశారు. ఒక లుక్కులో లుంగీ కట్టుకొని అవుట్ అండ్ అవుట్ మాస్ అన్నట్టు కనిపించారు. మరొక లుక్కులో సూట్ వేసుకుని బండి అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోయారు. ఇంకొక లుక్కులో బ్లాక్ డ్రెస్ వేసి ఆత్మలకు అధిపతి అన్నట్టు కనిపించారు. టీజర్ విడుదల అయితే ఈ కథ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమా!The Raja Saab Movie Release Date: 'ది రాజా సాబ్' సినిమాను తొలుత ఈ వేసవిలో థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేశారు. అయితే అది కుదరలేదు. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాలలో వినబడుతున్న సమాచారం ప్రకారం... డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమాను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి టీజర్ విడుదల చేసినప్పుడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారేమో చూడాలి.
Also Read: రాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!
ప్రభాస్ సరసన ముగ్గురు అందాల భామలు!'ది రాజా సాబ్' సినిమాలో ముగ్గురు అందాల భామలు ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభాస్ సరసన ఫస్ట్ టైమ్ యాక్ట్ చేసే అవకాశం అందుకోవడం విశేషం. మలయాళ భామ మాళవిక మోహనన్, హైదరాబాద్ సిటీలో జన్మించిన మార్వాడి అమ్మాయి నిధి అగర్వాల్, నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ది కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ