పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు రెండేళ్ల తర్వాత వెండి తెర మీద సందడి చేయబోతున్నారు. మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej)తో కలిసి ఆయన నటించిన 'బ్రో' జూలై 28, 2023లో విడుదల అయ్యింది. ఆ తరువాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు పవన్. 'హరి హర వీరమల్లు'తో ఈ నెల 12న థియేటర్లలోకి రానున్నారు. అదే రోజు మరో సినిమా లేటెస్ట్ షెడ్యూల్ పవన్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.
జూన్ 12 నుంచి ఉస్తాద్ లేటెస్ట్ షెడ్యూల్హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఒక షెడ్యూల్ చేశారు. షూటింగ్ చేసింది వారమే అయినా... ఒక టీజర్ విడుదల చేశారు హరీష్ శంకర్. గాజు పగిలే కొద్ది పదును ఎక్కుద్ది వంటి డైలాగులు ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు చాలా ఉత్సాహాన్నిఇచ్చాయి.
Also Read: రాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!
రాజకీయాలలో పవన్ బిజీ కావడంతో మధ్యలో రవితేజ హీరోగా 'మిస్టర్ బచ్చన్' సినిమా తీశారు హరీష్ శంకర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 12వ తేదీ నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానందుని, అందులో మొదటి రోజు నుంచి పవన్ పాల్గొంటారని తెలిసింది.
కథలో మార్పులు - చేర్పులు చేసిన హరీష్ఏపీ ఎన్నికలలో కూటమి ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేశారట హరీష్ శంకర్. ఎన్నికలకు ముందు ఏపీలో కార్ టాప్ మీద పవన్ కళ్యాణ్ కూర్చుని వెళ్లిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని స్క్రిప్ట్‌లో యాడ్ చేశారట.
పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యంగ్ అండ్ సెన్సేషనల్ శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్', మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' ఫేమ్ సాక్షి వైద్య మరొక హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద రవిశంకర్ వై, నవీన్ ఎర్నేని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ