ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక సూచన చేశారు. ఏపీలో సినిమా టికెట్ రేట్స్ హైక్ కోసం దర్శక నిర్మాతలు గానీ, హీరోలు గానీ తనను వ్యక్తిగతంగా కలవొద్దని... తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు 'హరిహర వీరమల్లు' నిర్మాత ఏయం రత్నం (AM Ratnam) ఛాంబర్ దగ్గరకు వెళ్లారు.
భరత్ భూషణ్‌ను కలిసిన రత్నం...ఏపీలో వీరమల్లు టికెట్స్ రేట్ హైక్ కోసం!జూన్ 12వ తేదీన 'హరిహర వీరమల్లు' విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా టికెట్స్ రేట్ హైక్ కోసం... తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా నిర్మాత ఏయం రత్నం రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. జూన్ 2వ తేదీన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భారత భూషణ్ (Bharat Bhushan)ను కలిసి ఏపీలో వీరమల్లు స్పెషల్ షోస్‌తో పాటు టికెట్ రేట్స్ పెంచవలసిందిగా కోరారు. పవన్ కళ్యాణ్ సొంత సినిమాకు అయినా సరే సేమ్ రూల్స్ అని దీంతో స్పష్టమైంది. అధికారంలో ఉన్నప్పటికీ అందరి పట్ల జనసేనాని ఒకేలా వ్యవహరిస్తారని మరోసారి చెప్పిన్నట్టు అయ్యింది.
Also Read: రాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!
వీరమల్లు విడుదలకు ముందు కుట్ర...టాలీవుడ్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ సూచన!జూన్ 12న 'హరిహర వీరమల్లు' విడుదల అవుతున్న సంగతి తెలిసినా ఇండస్ట్రీలో కొంత మంది జూన్ 1వ తేదీ నుంచి థియేటర్స్ బంద్ చేయడానికి కుట్ర చేశారని, సినిమా హాళ్లు మూసివేయాల్సిందిగా ఆ నలుగురు ఒత్తిడి తీసుకువచ్చారని జరిగిన ప్రచారం పట్ల విచారణకు ఆదేశించారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
ఇండస్ట్రీ అడిగిన వరాలు ఇచ్చినప్పటికీ... ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలవలేదని, సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల అయింది. అందులో చిత్రసీమకు పలు సూచనలు చేశారు. ఇక నుంచి టికెట్ రేట్స్ హైట్ కోసం వ్యక్తిగతంగా ఎవరూ డిప్యూటీ సీఎంను కలవద్దని, ఫిలిం ఛాంబర్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఏయం రత్నం నడుచుకున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమాలో బాబీ డియోల్ విలన్. ఏయం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సినిమా పూర్తి అయింది. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో సినిమా విడుదల కానుంది.