Telusu Kada movie release date announced: 'తెలుసు కదా'... ఈ టైటిల్‌లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ఒక సినిమా చేస్తున్నారని! ఇదొక న్యూ జనరేషన్ లవ్ స్టొరీ. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకు వస్తున్నారు. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

అక్టోబర్ 17వ తేదీన 'తెలుసు కదా'!దీపావళి అక్టోబర్ నెలలో వచ్చింది. శనివారం (18వ తేదీ) నుంచి మంగళవారం (23వ తేదీ) వరకు దీపావళి. ఈ పండక్కి ముందు... అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలోకి తెలుసు కదా సినిమాను తీసుకు వస్తున్నట్లు సిద్ధూ‌ జొన్నలగడ్డ తెలిపారు. థియేటర్లలో దీపావళి సంబరాలు కాస్త ముందుగా తీసుకు వస్తున్నామని ఆయన వివరించారు.

Also Read: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... మీ ఖర్మ - అలీకి సారీ చెప్పలేదు... పైగా జనాలకు రాజేంద్రుడి క్లాస్

'తెలుసు కదా' సినిమాలో రాశీ ఖన్నాతో పాటు 'కేజీఎఫ్', 'హిట్ 3' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు... హీరోకు ఇద్దరు అందాల భామలు ఫోన్ చేయడం, ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగడం, ఆ తర్వాత 'తెలుసు కదా... లవ్ యు 2' అంటూ సిద్ధూ జొన్నలగడ్డ చెప్పడం..‌. రిలీజ్ డేట్ కోసం ప్రత్యేకంగా చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. యాక్చువల్లీ... 'లవ్ యు 2' అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడం అనుకుంటాం. కానీ, ఇక్కడ 'లవ్ యు 2' అంటే ఇద్దర్ని ప్రేమించడం అన్నమాట. 

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ

'తెలుసు కదా' సినిమా ద్వారా ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వ పసాద్, టీజీ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వైవా' హర్ష ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞాన శేఖర్ బాబా, కూర్పు: జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: తమన్.