పోర్న్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ నటి గెహనా వశిష్ట్ ముంబై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  మంగళవారం ఆమె బెయిలు దరఖాస్తు విచారణకు వచ్చింది. ముంబై హైకోర్టు జడ్జి గెహనాకు ముందుస్తు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో గెహనా అరెస్టుకు పోలీసులు మార్గం సుగమమైంది. 


బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వెబ్ సిరీస్ లు తీశారన్న ఆరోపణలతో అరెస్టు అయ్యారు. గెహనా అతనికి మద్దతుగా నిలిచింది. ఆమె నటించిన మూడు అశ్లీల వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాగే ఓ మహిళ, గెహనా తనను పోర్న్ ఫోటో షూట్ చేయాలని కోరుతూ ఒత్తిడి తెచ్చిందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో గెహనాను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల తరువాత ఆమె బెయిలుపై బయటికి వచ్చింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె పోలీసులకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో రూ.15 లక్షలు గెహనా, పోలీసులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదరినట్టు తేలింది. దీనికి సంబంధించి ఆమె చేసిన వాట్సాప్ ఛాటింగ్ కూడా బయటపడింది. 


కాగా ఆమె తరపు న్యాయవాది మాత్రం పోలీసులు అడిగిన లంచం ఇచ్చేందుకు తన క్లయింట్ నిరాకరించడం వల్లే ఆమెను పోలీసులు టార్గెట్ చేశారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఆమెపై అన్యాయంగా పోర్న్ కేసు పెట్టారంటూ హైకోర్టులో వాదించారు. గెహనాపై ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యిందని, అందుకే ముందస్తు బెయిలు ఇప్పించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అతని వాదనలను నమ్మలేదు. ఈ కేసులో ముందస్తు బెయిలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో గెహనా మళ్లీ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై శివారులో ఉన్న మాద్ అనే దీవిలో ఓ భవంతిలో పోర్న్ వీడియోలు తీస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ఘటనలో కొంతమందిని అరెస్టు చేశారు. విచారణలో రాజ్ కుంద్రా పేరు వెలుగులోకి వచ్చింది. వెబ్ సిరీస్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, యువతలు చేత పోర్న్ వీడియోలు చేయిస్తున్నాడని బయటపడింది. ఇదే కేసులో గెహనా కూడా గతంలో అరెస్టు అయ్యింది. 


Also read: పిల్లల లంచ్ బాక్సు రెసిపీ... కొత్తిమీర రైస్


Also read: కోటి రూపాయలు గెలిచిన హిమానీ కంటి చూపు పోవడం వెనుక విషాద కథ


Also read: పని ఒత్తిడి పెరుగుతోందా... మగవాళ్ల కన్నా ఆడవాళ్లకే ముప్పు ఎక్కువ