2012లో తమిళ చిత్రం ‘మూగమూడి’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజా హెగ్డే. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతోంది. ఇటీవలే ‘సర్కస్’ సినిమాలో కనిపించిన, ఈ 32 ఏళ్ల ముద్దుగుమ్మ, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ హీరోలతో కలిసి పని చేసింది. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
సౌత్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న పూజా హెగ్డే, ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతోంది. పూజా రూ. 50 కోట్ల విలువైన నికర ఆస్తులను కలిగి ఉన్నట్లు ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ పేర్కొంది. విలాసవంతమైన, ఖరీదైన ఆస్తులు ఆమె పేరుతో ఉన్నాయట. ముంబైలో అద్భుతమైన అపార్ట్ మెంట్, ఖరీదైన కార్లు పూజా హెగ్డేకు ఉన్నాయట.
1. ముంబైలో విలాసవంతమైన అపార్ట్ మెంట్
‘మొహెంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొంతకాలం తర్వాత పూజా హెగ్డే ముంబై బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. ఈ అద్భుతమైన 3-BHK అపార్ట్ మెంట్‌ను సుమారు రూ. 6 - 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ ఇంటిని తనకు నచ్చినట్లుగా రీ డిజైన్ చేయించుకుంది. అత్యంత ప్రశాంతంగా విలాసవంతగా ఈ ఇల్లు కనిపిస్తోంది.
2. రూ.2 కోట్ల విలువైన పోర్స్చే కెయెన్
మోడల్ నుంచి నటిగా మారిన పూజా అద్భుతమైన పోర్స్చే కయెన్ ను ఉపయోగిస్తోంది. ఈ కారు 550bhp శక్తిని కలిగి ఉంది. 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ ఉంది. జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ ఉత్పత్తి చేసే ఈ కారు ధర సుమారు రూ.1.27 కోట్లతో మొదలై రూ.1.93 కోట్ల వరకు ఉంటుంది. అయితే, పూజా ఈ కారును తనకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుంది. ఈ కారు ధర మార్కెట్ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. పోర్స్చే కయెన్‌తో పాటు, రూ. 80 లక్షల విలువైన ఆడి క్యూ7, సుమారు రూ.60 లక్షల ఖరీదు చేసే స్టైలిష్ జాగ్వార్ కూడా ఉందట.
3. రెమ్యునరేషన్, ఎండార్స్ మెంట్స్
‘మహర్షి’, ‘అరవింద సమేత’, ‘ దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో’ సహా పలు హిట్ సినిమాల్లో నటించిన పూజా.. తన పాత్రను బట్టి ఒక్కో ప్రాజెక్ట్ కు రూ.3 కోట్లు తీసుకుంటుంది. ఇటీవలే ‘సర్కస్’ మూవీలో కనిపించిన హెగ్డే రూ. 2.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిట్రా, ఫరెవర్ న్యూ, గార్నియర్ సహా ఇతర ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతోంది.
4. నికర ఆస్తుల విలువ
పూజా హెడ్గే నికర ఆస్తుల విలువ రూ. 50 కోట్లు అని సమాచారం.
5. ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ల సేకరణ
పూజా హెగ్డే ఇన్ స్టా గ్రామ్‌ను చూస్తే హ్యాండ్‌బ్యాగ్‌ల పట్ల ఆమెకున్న ఆసక్తి కనిపిస్తోంది. లూయిస్ విట్టన్ నుంచి క్రిస్టియన్ డియోర్ వరకు, హెగ్డే వార్డ్ రోబ్ ఇంటర్నేషనల్ లేబుల్‌లతో నిండి ఉంది. ఎన్నో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ ఆమె దగ్గర ఉన్నాయి.
6. విదేశీ ప్రయాణాలు
పూజాకు విదేశీ ప్రయాణాలు అంతే ఎంతో ఇష్టం. వరుస సినిమాలు చేస్తున్నా, సమయం దొరికితే వెకేషన్స్ కోసం ఫారిన్ కు వెళ్తుంటుంది. లండన్‌లో రద్దీగా ఉండే వీధులను ఆస్వాదించడం నుంచి మాల్దీవుల్లోని సహజమైన బీచుల్లో ఎంజాయ్ చేయడం వరకు పూజాకు పర్యాటక ప్రాంతాలంటే చాలా ఇష్టం.