ర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR‘ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట ఈ సినిమా గుర్తించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,200 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన ఈ చిత్రం, ఓటీటీలో కూడా విడుదలై అద్భుత ఆదరణ దక్కించుకుంది. జపాన్ లోనూ ఈ సినిమా సత్తా చాటింది. జపాన్ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సాధించింది. ముత్తు రికార్డును కూాడా బద్దలు కొట్టింది. తాజాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ నథాలీ ఇమ్మాన్యుయేల్ ‘RRR‘ సినిమాపై ప్రశంసలు కురిపించింది.


నెగెటివ్ ట్వీట్.. పాజిటివ్ గా!


వాస్తవానికి ఈ సినిమా గురించి ముందుగా నెగెటివ్ కోణంలోనే ఆమె ట్వీట్ చేసింది. ‘‘RRR సిక్ మూవీ అని ఎవరూ చెప్పలేరు’’ అయితే, ఆమె అది నెగటివ్ సెన్స్‌తో చెప్పినట్లుందనే విమర్శలు రావడంతో.. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది.  తాజాగా ఈ సినిమాను చూసిన నథాలీ ట్విట్టర్ వేదికగా ‘RRR‘ గురించి వరుస ట్వీట్లు చేసింది. సినిమాలో ఒక్కొక్కరి నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘RRR‘ ఓ అద్భుత సినిమా అంటూ అభివర్ణించింది. సీత పాత్రలో ఆలియా భట్ ఒదిగి పోయిందని చెప్పింది. సినిమా క్లైమాక్స్ ఫైట్‌ లో  భీమ్ భుజాలపై రామ్‌ని మోసే సీన్ అద్భుతమని చెప్పింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ మామూలుగా లేదని చెప్పింది.





విప్లవ వీరుల కథ


రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR‘ మూవీ భారతీయ విప్లవకారుల కల్పిత కథతో తెరెక్కింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషించగా, జూనియర్ ఎన్టీఆర్  కొమరం భీమ్ క్యారెక్టర్ చేశారు. భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉన్న 1920 నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్   కీలక పాత్రల్లో నటించారు. ‘RRR‘  ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ. 1200 కోట్లు వసూలు చేసింది.


ఆస్కార్ బరిలో ‘RRR


ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రంతో సహా 14 కేటగిరీలలో ఈ చిత్రం ఆస్కార్ 2023 నామినేషన్ పరిశీలనకు  పంపబడింది.  ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ అనే పాట ఉత్తమ పాటల విభాగంలో షార్ట్‌ లిస్ట్ చేయబడింది. ఇప్పటికే ఈ పాట  ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది.  ఈ చిత్రం క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌ లో ఐదు నామినేషన్లను  పొందింది.  ‘RRR’ సంగీత దర్శకుడు, MM కీరవాణి లాస్ ఏంజిల్స్ ఫిల్మ్స్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో EO కోసం పావే మైకీటిన్‌ని ఓడించి ఉత్తమ సంగీత స్కోర్‌గా అవార్డును అందుకున్నారు.


Read Also: బాలీవుడ్ ఎంట్రీ బెడిసి కొట్టిందే - 2022లో ఈ తారలకు తప్పని చేదు అనుభవం