2022 బాలీవుడ్ కు పెద్దగా కలిసి రాలేదు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘భూల్ భూలయ్యా 2’ లాంటి సినిమాలు ఫర్వాలేదు అనిపించినా, లాల్ సింగ్ చద్దా, సామ్రాట్ పృథ్వీరాజ్ సహా పలు భారీ బడ్జెట్ సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యాయి. ఈ ఏడాది బాలీవుడ్ లోకి పలువురు నటీనటుడు అరంగేట్రం చేసినా, పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..  


1. షిర్లీ సెటియా- నికమ్మ


సింగర్ షిర్లీ సెటియా ఎట్టకేలకు బాలీవుడ్ తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘నికమ్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ  భారీ డిజాస్టర్‌ గా నిలిచింది. శిల్పాశెట్టి, అభిమన్యు దాసాని లాంటి స్టార్స్ నటించినా పరాజయం నుంచి కాపాడలేకపోయారు.  నాని, సాయి పల్లవిల తెలుగు హిట్ మూవీ ‘మిడిల్ క్లాస్ అబ్బాయికి’ రీమేక్ గా ఈ సినిమా తెరెక్కింది. కానీ, హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


2. విజయ్ దేవరకొండ- లైగర్


తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. దిగ్గజ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటించారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ  మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని భావించారు. కానీ, చివరకు డిజాస్టర్ గా మిగిలింది. విజయ్ హిందీ ఎంట్రీ దారుణంగా బెడిసికొట్టింది.


3. మానుషి చిల్లర్ - సామ్రాట్ పృథ్వీరాజ్


అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కి పీరియాడికల్ డ్రామా ‘సామ్రాట్ పృథ్వీరాజ్‌’. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడిని ఈ సినిమా థియేట్రికల్ రన్ కేవలం రూ. 64.62 కోట్లను సాధించింది. ఈ సినిమాతో మిస్ వరల్డ్ 2017 విజేత మానుషి చిల్లర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఫ్లాప్ అందుకుంది.


4. నాగ చైతన్య - లాల్ సింగ్ చద్దా


తెలుగు స్టార్ నాగ చైతన్య ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాయ్ కాట్ బాలీవుడ్ దెబ్బకు ఏకంగా షోలకు షోలే క్యాన్సిల్ అయ్యాయి.   


5. ఆండ్రియా కెవిచుసా- అనేక్


ఆయుష్మాన్ ఖురానా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘అనేక్’తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నటి ఆండ్రియా కెవిచుసా. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను సాధించడంలో ఘోరంగా విఫలం అయ్యింది.


6. ఖుషాలి కుమార్ - ధోఖా: రౌండ్ డి కార్నర్


ఈ సంవత్సరం ‘ధోఖా: రౌండ్ డి కార్నర్‌’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఖుషాలి కుమార్‌. R మాధవన్, అపర శక్తి ఖురానా, దర్శన్ కుమార్‌ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


Read Also: టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముగ్గురు భామలు, 2023 అంతా వీళ్లదేనా?