Modi Write Letter to Rakul and Jackky: మూడేళ్ల ప్రేమ బంధానికి స్వస్తీ చెప్పి ఏడడుగులు వేశారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీ భగ్నానీ. ఫిబ్రవరి 21న వీరిద్దరు మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే గోవాలో గ్రాండ్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది. అయితే ఇద్దరు పెద్ద స్టార్స్‌ అయినా ఇండియాలోనే వీరు పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. అయితే వారి ఈ నిర్ణయం వెనకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియాలోనే పెళ్లి చేసుకుని మన టూరిజం అభివృద్ధికి సహకరించాలని మోదీ కోరారట. ఆయన సూచన మేరకు విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేసుకోవాలన్న వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. 


దీంతో రకుల్‌-జాకీ పెళ్లికి గోవా వేదికైంది. అయితే; నిన్న ఫిబ్రవరి 21న సౌత్ గోవాలోని ITC గ్రాండ్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, ఆయుష్మాన్‌, అర్జుణ్‌ కపూర్‌, రవీణా టాండన్‌ వంటి బాలీవుడ్ స్టార్స్‌, ప్రముఖులు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లికి ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం అందింది. కానీ తన బిజీ షెడ్యూల్‌ కారణంగా మోదీ రకుల్‌-జాకీ పెళ్లికి హజరకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు తాజాగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన ఆఫీషియల్‌ ఎక్స్‌ పోస్ట్‌లో కొత్త జంటను శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్‌ నోట్‌ షేర్‌ చేశారు. అలా సోషల్‌ మీడియాలో వేదికగా మోదీ రకుల్‌-జాకీ భగ్నానీ ఆశీర్వాదించారు. ఆయన ట్వీట్‌పై రకుల్‌, జాకీలు స్పందించారు. "మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఎంతో ముఖ్యమైనవి. చాలా కృతజ్ఞతలు మోదీ గారు"అని పేర్కొంది.






Also Read: విడాకులకు సిద్ధమైన ఉదయ్ కిరణ్ హీరోయిన్‌ దివ్య ఖోస్లా? - క్లారిటీ ఇచ్చిన టీ-సిరీస్‌ నిర్మాత టీం


ఇక జాకీ భగ్నానీ కూడా మోదీకి థాంక్యూ చెబుతూ ట్వీట్ చేశారు. “మీ ఆశీర్వాదాలు మా గుండెను హత్తుకున్నాయి” అంటూ జాకీ చెప్పుకొచ్చారు. కాగా దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. అయితే రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో పెళ్లి చేసుకోనున్నట్టు మొదటి నుంచి అందుతున్న సమాచారం. ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక జరిగినట్టు  పెళ్లి ఫొటోలు చూస్తుంటే అర్థమవుతుంది. రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్‌ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. అప్పుడే తన ప్రేమను ఆఫీషియల్‌ కూడా చేసిది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.