Ustaad Bhagat Singh Climax Scene Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి బాక్సాఫీస్ సెలబ్రేషన్ తర్వాత పవన్ - హరీష్ కలయికలో వస్తున్న చిత్రమిది. దాంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వీరమల్లు ప్రచార కార్యక్రమాల్లో పవన్ లుక్స్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేశాయి. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఉస్తాద్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి...ఎమోషన్ & హై వోల్టేజ్ యాక్షన్!ఒక వైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ... మరో వైపు 'హరి హర వీరమల్లు' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ... 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూశారు పవన్. జెట్ స్పీడుతో షూటింగ్ చేస్తూ క్లైమాక్స్ కంప్లీట్ చేశారు. పవర్ స్టార్ హార్డ్ వర్క్, డెడికేషన్‌కు, కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు.
Also Read: ఓటీటీలోకి టాలీవుడ్ ప్రొడ్యూసర్ మలయాళం డార్క్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఎమోషనల్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్‌తో కూడిన క్లైమాక్స్ డిజైన్ చేశారట హరీష్ శంకర్. అది సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందట. ఈ పవర్ ఫుల్ సీక్వెన్సుకు నబకాంత మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ వల్ల ఆ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చిందని చిత్ర బృందం పేర్కొంది. క్లైమాక్స్ షూట్ కంప్లీట్ అయ్యాక నబకాంత మాస్టర్ టీం, ఫైటర్లు అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్లైమాక్స్ సీక్వెన్స్ అద్భుతంగా రావడానికి కృషి చేసినందుకు అప్రిషియేట్ చేశారు.
Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా
Hari Hara Veera Mallu Cast And Crew: 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీ లీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రచన - దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కథనం: కె. దశరథ్, రచనా సహకారం: సి. చంద్రమోహన్, ఛాయాగ్రహణం: అయనంక బోస్, కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, కళ: ఆనంద్ సాయి, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రావిపాటి చంద్రశేఖర్ - హరీష్ పై, ఫైట్స్: రామ్ & లక్ష్మణ్ - నబకాంత మాస్టర్.