పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? 'వకీల్ సాబ్' కోసం 'దిల్' రాజు దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయలు ఇచ్చారని ఇండస్ట్రీ గుసగుస. 'భీమ్లా నాయక్'కు ఎంత ఇచ్చారనేది ఇంకా బయటకు రాలేదు. కానీ, గట్టిగా ఇచ్చినట్టు భోగట్టా. 'వకీల్ సాబ్'ను తక్కువ రోజుల్లో పవన్ కల్యాణ్ కంప్లీట్ చేశారు. అందువల్ల, అప్పట్లో ఆ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ సినిమా కంటే తక్కువ రోజుల్లో మరో సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ రెడీ అవుతోందని, దానికి 'వకీల్ సాబ్' కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతోందని ఫిల్మ్ నగర్ ఖబర్.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతోంది. తమిళ హిట్ 'వినోదయ సితమ్'ను పవన్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో ఆయనతో పాటు మేనల్లుడు సాయి తేజ్ కూడా నటించనున్నారు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ 20 రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుందని సమాచారం. ఆ 20 రోజులకు 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అన్నారట. అంటే... రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు అన్నమాట. అది కాకుండా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట.
Also Read: Sai Pallavi Craze: సాయి పల్లవి - క్రేజ్‌లో లేడీ పవర్ స్టార్!
హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు రూ. 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని మరో టాక్. అయితే... ఆ సినిమాకు పవన్ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. టాలీవుడ్ మార్కెట్ ను బేస్ చేసుకుని పవన్ కల్యాణ్ కు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తుండటం ఇండస్ట్రీలో కొంత మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Also Read: ఓటీటీలో 'భీమ్లానాయక్', రిలీజ్ ఎప్పుడంటే?