పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పారు. లేటుగా చెబుతున్నానని అంటూనే లేటెస్టుగా చెప్పారు. ఇప్పుడు పవన్‌కు కంగ్రాట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే... 'భీమ్లా నాయక్' సినిమా! థియేటర్లలో కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. 'ఆహా'లో ఆ సినిమాను అల్లు అర్జున్ చూశారు. పవన్ సహా ఇతర చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారు.


"నేను కొంచెం లేట్ అయ్యాను. అయితే... పవన్ కల్యాణ్ గారు, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ గారు, దర్శకుడు సాగర్ చంద్ర, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, నిర్మాత నాగవంశీ, ఇతర చిత్రబృందానికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్. 'భీమ్లా నాయక్' భారీ బ్లాక్ బస్టర్ సాధించింది" అని అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఆహాలో హయ్యస్ట్ క్వాలిటీలో సినిమాను ఎంజాయ్ చేయమని చెప్పారు.


'ఆహా' ఓటీటీ బృందానికి కూడా అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పారు. ఓటీటీ స్టార్ట్ చేసిన రెండేళ్లలో 4కె వీడియో, డాల్బీ 5.1 ఆడియో స్టార్ట్ చేసిందనీ... అదీ 'భీమ్లా నాయక్'తో స్టార్ట్ అయ్యిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.


Also Read: 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ నడిపిన బండి కావాలా? అయితే ఇలా చేయండి!


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటించిన 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. తమన్ సంగీతం అందించారు.


Also Read: చెన్నైలో శింబు కారు బీభత్సం, 70 ఏళ్ళ వ్యక్తి మృతి