ప్రముఖ తమిళ హీరో శింబు (silambarasan tr) డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం ఓ యాక్సిడెంట్. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో శింబు ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, ఆయన తండ్రి - దర్శకుడు టి. రాజేంద్రర్ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


చెన్నైలో గత శుక్రవారం (మార్చి 18న) ఒక కారు బీభత్సం సృష్టించింది. ఆలస్యంగా ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఎలాంగో సలై పోయెస్ రోడ్ జంక్షన్ లో మార్చి 18న జరిగిన యాక్సిడెంట్ వీడియో ఒకటి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో ఉన్న ఇన్నోవా కారు శింబు పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. 70 ఏళ్ళ వ్యక్తి మీదకు కారు దూసుకు వెళ్లడంతో, ఆ వ్యక్తికి గాయాలు అయ్యాయి.


ఇన్నోవా ఢీ కొట్టడంతో గాయాలు అయిన వ్యక్తి పేరు మునుస్వామి అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అతడు కారు దిగి పరారయ్యాడట. అతడిని తాజాగా అరెస్ట్ చేసినట్టు చెన్నై వర్గాల కథనం. అయితే... శింబు తండ్రి టి. రాజేంద్రర్ అంబులెన్స్ కి ఫోన్ చేసి డ్రైవర్ చేత మునుస్వామిని ఆస్పత్రికి పంపారని మరో కథనం. ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని మునుస్వామి మరణించారు.


Also Read: RRR - Caste Feeling : RRRకు ముందు మరోసారి కులాల ప్రస్తావన


కారు శింబు పేరు మీద రిజిస్టర్ కావడంతో చర్చనీయాంశం అవుతోంది. చెన్నైలోని పాండీ బజార్ పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.సెక్షన్ 337, 297, 304 (ఏ) కింద కేసులు పెట్టారు. డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. శింబు ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఈ ప్రమాదాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని, ఆయన్ను వార్తల్లోకి లాగుతున్నారని అభిమానులు అంటున్నారు. 


Also Read: 'గని'లో తమన్నా సాంగ్ వీడియో వచ్చిందోచ్! ఆ గ్లామరూ, డ్యాన్సూ చూశారా?