Paradha Review In Telugu Starring Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా 'పరదా'. మలయాళ నటి దర్శనా రాజేంద్రన్, సంగీత మరో రెండు ప్రధాన పాత్రల్లో నటించారు. 'సినిమా బండి', 'శుభం' ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం (ఆగస్టు 22న) రిలీజ్ అయితే బుధవారం రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు. సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? అనేది చూడండి.
క్లైమాక్స్ వర్కవుట్ అయ్యింది...
ముగ్గురు మహిళలు కుమ్మేశారు!
'పరదా'కు సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ టాక్ లభించింది. ప్రీమియర్స్ నుంచి సినిమా బావుందని ప్రచారం జరుగుతోంది. మెజారిటీ జనాలు చెప్పే మాట క్లైమాక్స్ వర్కవుట్ అయ్యిందని! దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ముగింపు మంచిగా ఇచ్చారట.
అనుపమ పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... 'పరదా'లో మూడు మెయిన్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు అద్భుతంగా నటించారట. వాళ్ళ ముగ్గురి నటన సినిమాను నిలబెట్టిందని జనాలు చెబుతున్నారు.
మూఢ నమ్మకాలపై పోరాటం...
మహిళల కోసం తీసిన సినిమా అంటూ!
సమాజంలో మూఢ నమ్మకాలు చాలా ఉంటాయ్. అందులో మహిళల స్వేచ్ఛను హరించేవి కొన్ని ఉంటాయి. ఆ నమ్మకాల మీద, మహిళల సాధికారత మీద తీసిన సినిమా 'పరదా'. మహిళల స్వేచ్ఛను ఎలా హరిస్తున్నారనే సన్నివేశాలను దర్శకుడు బాగా తీశారని పేరొచ్చింది. ఎమోషనల్ సీన్స్ బాగా డీల్ చేశారట. కొన్ని కామెడీ సీన్లు నవ్వించాయని టాక్ వచ్చింది.
Also Read: ఆ ఓటీటీకే అనుపమ పరమేశ్వరన్ 'పరదా' డిజిటల్ రైట్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
గోపీసుందర్ సంగీతం గురించి సైతం కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన రొటీన్ సినిమాలు కొన్నిటి కంటే 'పరదా' బావుందని, ఫ్రెష్ కాన్సెప్ట్ తీసుకుని కొత్తగా చేశారని పేరు వచ్చింది. 'పరదా' గురించి సోషల్ మీడియాలో కొందరు చేసిన ట్వీట్లు చూడండి.