Anupama Parameswaran's Paradha OTT Platform Locked: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా మూవీ 'పరదా'. సినిమా బండి, శుభం చిత్రాల ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహించగా... ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.
ఆ ఓటీటీకి డిజిటల్ రైట్స్
ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే చాన్స్ ఉంది. ఈ మూవీలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, సంగీత కీలక పాత్రలు పోషించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువతో కలిసి మూవీని నిర్మించారు.
ఈ మూవీలో అనుపమ 2.Oను చూడబోతున్నారంటూ ట్రైలర్ లాంచ్ సందర్భంగా యంగ్ హీరో రామ్ పోతినేని తెలిపారు. 'సుబ్బు' అనే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ ఈ 'పరదా' స్టోరీ సాగబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఊరిలో కఠినమైన కట్టుబాట్లు, మగవారికి మాత్రమే ఉండే వెసులుబాట్లు నుంచి విసిగిపోయిన ఓ అమ్మాయి ఇద్దరు అపరిచితులతో కలిసి ట్రిప్‌నకు వెళ్తుంది. ఆ టైంలో ఆమె అదృశ్యం కాగా... ఊరిలో ఊహించని ప్రమాదం పొంచి ఉంటుంది. అసలు ఆమెకు ఎదురైన ప్రమాదం ఏంటి? ఊరిలో అంతా ఎందుకు సుబ్బుకు వ్యతిరేకంగా మారుతారు? ఆమె 'పరదా' వెనుక అవమానాలు, కట్టుబాట్లు ఏంటో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.