Duniya Salam Anali Song From War 2 Movie Released: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'దునియా సలాం అనాలి' సాంగ్‌ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఎనర్జిటిక్ స్టెప్స్... సాంగ్ అదుర్స్

ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఇద్దరూ ఎనర్జిటిక్ స్టెప్స్‌తో పోటా పోటీగా గూస్ బంప్స్ తెప్పించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ... ఫుల్ సాంగ్‌ను థియేటర్లలో చూడాల్సిందేనంటూ ట్వీట్ చేశారు మేకర్స్. తాజాగా... ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. 

'అపరిచితుడే నేస్తమయ్యే కలిసినా ఒక పూటలో... ప్రాణమే ఇమ్మన్నాడులే పరిచయం పెరిగేంతలో...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు ప్రీతమ్ మ్యూజిక్ అందించగా... నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణకాంత్ తెలుగులో లిరిక్స్ రాశారు. 

Also Read: డిసప్పాయింట్ చేసినందుకు సారీ... 15 ఏళ్లు టైం ఉందిలెండి - ట్రోలర్స్‌కు ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్

రూ.300 కోట్లు దాటిన కలెక్షన్స్

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఆరో చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. YRF బ్యానర్‌పై ఆదిత్య చోప్రా మూవీని నిర్మించగా... కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. హిందీలో మంచి వసూళ్లు రాబడుతోంది. సోమవారం రూ.7.50 కోట్ల నెట వసూళ్లు అందుకోగా... మంగళవారం రూ.8.50 కోట్ల నెట వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.