The Sabarmati Report: నిజ జీవిత సంఘటనలు, ప్రముఖుల జీవిత కథల ఆధారంగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు మంచి ఆదరణ పొందుతున్నాయ్. థియేటర్లలో కాస్త అటుఇటుగా ఉన్నా ఓటీటీలో దూసుకెళ్తున్నాయ్. లేటెస్ట్ గా OTT ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఏంటంటే.. ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమాల తీరు మారుతోంది. స్టార్ స్టేటస్ కన్నా సినిమాలో కథ, కథనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు. స్టోరీ బావుంటే హీరో ఎవరైనా కానీ ఆదరిస్తున్నారు..తేడా వస్తే స్టార్ హీరో అయినా కానీ నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, ప్రముఖుల బయోపిక్ లు ప్రత్యేకం అని చెప్పుకోవాలి. అందుకే మేకర్స్ కూడా ఇలాంటి కంటెంట్ ని ఎంపిక చేసుకుంటున్నారు..అంతే సవాల్ గా తెరకెక్కిస్తున్నారు. థియేటర్లలోనే కాదు ఓటీటీల్లోనూ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందడంలో సక్సెస్ అవుతున్నారు.
ఒరిజనల్ స్టోరీస్ ని స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పుడెప్పుడో సంఘటన జరిగిందని తెలిసినవాళ్లు చాలా మంది ఉంటారు కానీ దాని ముందు వెనుక ఏం జరిగిందనేది కొందరికే తెలుసు. ఇవన్నీ కవర్ చేస్తూ తెరకెక్కించినప్పుడు ఆడియన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుయాయి. ఈ కోవకే చెందుతుంది 'సబర్మతి రిపోర్ట్' (The Sabarmati Report).
2002లో దేశాన్ని కుదిపేసిన సంఘటన ఇది. కదులుతున్న రైల్లో 59 మంది సజీవ దహనమైన ఘటన ఆధారంగా తరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి ఈ ఘటన వెనుక ఏదో జరిగిందంటూ ఎన్నో అనుమానాలు, ఎన్నో పుకార్లు వచ్చాయ్. అలా జరగడానికి కారణమేంటి? రైలు మంటల్లో చిక్కుకోవడానికి ముందు ఏం జరిగింది? వీటన్నింటిపై దర్శకుడు ధీరజ్ సర్నా మొత్తం రీసెర్చ్ చేసి ‘సబర్మతి రిపోర్ట్’ తెరకెక్కించారు. అందుకే... అప్పటివరకూ వెంటాడిన ఎన్నో సందేహాలకు సబర్మతి రిపోర్ట్ సమాధానం ఇచ్చిదంటూ ప్రశంసలు దక్కాయ్.
2 గంటల 7 నిమిషాల ఈ సినిమాకు IMDb లో 8.2/10 రేటింగ్ వచ్చింది. 2024 నవంబర్లో రిలీజైన ఈ సినిమా గురించి ప్రధాని మోదీ పార్లమెంట్ లోనూ ప్రస్తావించారు. గోద్రా రైలు దహనం సంఘటనకు సంబంధించిన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయంటూ ఈ మూవీ గురించి సభలో ప్రస్తావించారు మోదీ.
ధీరజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో విక్రాంత్ మాస్సీ , రాశి ఖన్నా, రిద్ధి డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమూల్ వి. మోహన్, అన్షుల్ మోహన్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించారు.
దేశాన్ని కుదిపేసిన గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా తరకెక్కిన సబర్మతీ రిపోర్ట్ కి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. నిజాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించిన జర్నలిస్ట్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనేది ఫస్టాఫ్... నిజాన్ని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరనే కోణంలో సెకెండాఫ్ సాగుతుంది. ఓవైపు హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలు, ఇంకోవైపు ఆ ఘటన చుట్టూ అలుముకున్న రాజకీయాలు .. ఇవన్నీ టచ్ చేస్తూ సాగింది సబర్మతీ రిపోర్ట్ ఇప్పటివరకూ మీరు మిస్ అయి ఉంటే జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది..డోంట్ మిస్..