మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday) అంటే అభిమానులకు పండగ రోజు. ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చే రోజు. మరి, ఈ ఏడాది చిరు బర్త్ డే (Chiranjeevi Birthday Special)కు ఆయన చేస్తున్న రెండు సినిమాల అప్డేట్స్ రానున్నాయి. అందులో మొదటిది 'విశ్వంభర' (Vishwambhara Latest Update) మూవీ అప్డేట్.
చిరు బర్త్ డే స్పెషల్... 'విశ్వంభర' గ్లింప్స్!Vishwambhara Glimpse Release Date: 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు వశిష్ట మల్లిడితో చిరంజీవి చేస్తున్న సినిమా 'విశ్వంభర'. ఇదొక సోషియో ఫాంటసీ ఫిల్మ్. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహా సినిమా. ఆల్రెడీ గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి టీమ్ రెడీ అయ్యింది.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు ముందు ఆగస్టు 21న 'విశ్వంభర' గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మెగాస్టార్ చేత అనౌన్స్ చేయించింది. డేట్ అండ్ టైమ్ తెలియజేసింది. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఆ గ్లింప్స్ వస్తోంది.
సినిమా విడుదల మాత్రం 2026లో... క్లారిటీ!Vishwambhara Release Date: 'విశ్వంభర' షూటింగ్ కంప్లీట్ అయ్యి చాలా రోజులు అయ్యింది. బాలీవుడ్ భామ మౌనీ రాయ్ మీద ఇటీవల స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? అని ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' బదులు 'విశ్వంభర' రావాలి. కానీ వాయిదా పడింది. అప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం విడుదల మీద క్లారిటీ ఇచ్చారు.
Also Read: చిరు ఎందుకో వెనకబడ్డాడు... మెగాస్టార్ సత్తా మరోసారి చూడాలని ఉంది - అభిమానుల కోరిక
వచ్చే ఏడాది వేసవి... అంటే 2026 సమ్మర్ సీజన్‌లో సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తామని 'విశ్వంభర' టీమ్ పేర్కొంది. విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదని, ప్రేక్షకులకు క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు టైమ్ తీసుకుంటున్నారని చిరంజీవి తెలిపారు. పిల్లలకు, పెద్దలలోని పిల్లలకు ఈ సినిమా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న 'విశ్వంభర'ను యూవీ క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన సౌత్ క్వీన్ త్రిష కథానాయికగా నటించారు. 'నా సామి రంగ' ఫేమ్ ఆషికా రంగనాథ్ మరొక హీరోయిన్. సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కునాల్ కపూర్ విలన్. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.