లియా భట్‌కు బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఆమె నటించిన ‘RRR’ చిత్రం శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, ఇప్పటికే ఆమెకు ‘గంగూబాయి కతియావాడి’(Gangubai Kathiawadi) చిత్రంతో ఆమెకు ఎక్కడాలేని క్రేజ్ లభించింది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఈ చిత్రంలో అలియాభట్ వేశ్యగా, మాఫీయా క్వీన్‌గా రెండు భిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి రూ.100 కోట్ల కలెక్షన్లు లభించినట్లు టాక్. 


అలియా భట్‌కు కేవలం ఇండియాలోనే కాదు.. పక్కనున్న పాకిస్తాన్‌లో కూడా దండిగా అభిమానులు ఉన్నారు. ఇందుకు తాజా ఘటనే నిదర్శనం. పాకిస్థాన్‌కు చెందిన మునీబ్ బట్ అనే నటుడు అలియా భట్‌కు వీరాభిమాని అట. ‘అలియా భట్ సపోర్టర్స్ ఆన్‌లైన్’లో అనే ఇన్‌స్టగ్రామ్ పేజ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన భార్య అయిమాన్‌ ఖాన్‌తో కలిసి ‘గంగూబాయ్’ చిత్రం చూసేందుకు మునీబ్ ఏకంగా సినిమా హాల్ మొత్తాన్ని బుక్ చేశాడట.


Also Read: 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ నడిపిన బండి కావాలా? అయితే ఇలా చేయండి!


మూనీబ్ భార్య అయిమాన్ కూడా నటే. ఆమెకు అలియా భట్ అంటే చాలా ఇష్టమట. ఆమెను సర్‌ప్రైజ్ చేయడం కోసమే అతడు మొత్తం సినిమా హాల్‌ను బుక్ చేశాడట. పాన్ ఇండియా చిత్రం RRRలో కూడా అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ చిత్రాన్ని కూడా భార్యకు చూపించేందుకు మునీబ్ ప్లాన్ చేశాడో లేదో తెలియాలి. ఏది ఏమైనా.. ఇండియన్ హీరోయిన్ కోసం పాకిస్తాన్ అభిమాని ఇలా హాల్ మొత్తాన్ని బుక్ చేయడమంటే నిజంగా చిత్రమే కదూ. 


Also Read: చెన్నైలో శింబు కారు బీభత్సం, 70 ఏళ్ళ వ్యక్తి మృతి