Manoj did not file a complaint against the family members: మంచు మోహన్ బాబుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మనోజ్ కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేయలేదని పహాడి షరీఫ్ పోలీసులు తెలిపారు. మంచు మనోజ్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సీఐ గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదన్నారు. మోహన్ బాబు పై కుటుంబ సభ్యులపై సైతం మనోజ్ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. 


పది మంది గుర్తు తెలియని వ్యక్తుల దాడి 


ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని..  తమపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.  వారిని పట్టుకునే ప్రయత్నం చేశానని అయినా పారిపోయారన్నారు. దాడిలో తనకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ గాయాలకు సాక్ష్యంగా ఆస్పత్రి మెడికల్ రిపోర్టును సమర్పించారు. 


సీసీ టీవీ ఫుటేజీ మాయం చేసిన ఇద్దరు వ్యక్తులు


ఫిర్యాదులో తనకు .. తన  తన కుటుంబం సభ్యులకు థ్రెట్ ఉంది అని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా చెప్పలేదని పోలీసులు స్పష్టం చేశారు. మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో ఘటన   స్థలంలో కిరణ్ రెడ్డి , విజయ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు సీసీ ఫుటేజీని మాయం చేశారని వారి పేర్లు  చెప్పారు. 


పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్న పోలీసులు 


ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.  100కు ఫోన్ కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అయి ఇంటి వద్దకు చేరుకున్నామన్నారు.అప్పటికి అంతా హ్యాపీస్ అని చెప్పారన్నారు. ఇప్పుడు మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.   


100కు డయల్ చేయడంతో విషయం వెలుగులోకి !                


ఆదివారం డయల్ 100కు మంచు మనోజ్ తో పాటు మంచు మోహన్ బాబు కూడా ఫోన్లు చేసి ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లేసరికి ఇద్దరూ ఆల్ హ్యాపీస్ అని చెప్పడంతో వచ్చేశారు. పహాడీ షరీఫ్  సీఐ కూడా మీడియాకు అదే చెప్పారు. ఆదివారం సాయంత్రం తర్వాత మంచు మనోజ్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం అంతా ఆయన జల్ పల్లి ఇంట్లోనే ఉన్నారు.  మంచు లక్ష్మి కూడా వచ్చి మనోజ్ తో మాట్లాడారు. కుమారుడితో వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని మంచు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాదాపూర్ లో మంచు మోహన్ బాబు కుటుంబసభ్యులు సినీ ఇండస్ట్రీలో వివాదాలను పరిష్కరించే పెద్ద మనిషిగా ప్రచారంలో ఉన్న చినశ్రీశైలం యాదవ్ సాయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సమక్షంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్న సమయంలో మంచు విష్ణు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.