ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) పెన్ను పట్టారు. తన కొత్త సినిమా కోసం లిరిసిస్ట్ అవతారం ఎత్తారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో ఆయనొక పాట రాసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ప్రోమో విడుదల అయింది. 

Continues below advertisement


'నువ్వుంటే చాలే...' - రామ్ రాసిన గీతమిదే!
Nuvvunte Chaley Song Promo Released - Watch: 'ఆంధ్రా కింగ్ తాలూకా' కోసం 'నువ్వుంటే చాలే...' అంటూ రామ్ పోతినేని ఒక ప్రేమ గీతం రాశారు. ఈ రోజు విడుదల చేసిన ప్రోమో చూస్తే... గోదావరీ నదీ తీరంలో ఇసుక తిన్నెల మీద, రాజమండ్రిలో చక్కటి లొకేషన్లలోనూ సాంగ్ తీసినట్టు అర్థం అవుతోంది.  కొన్నిసార్లు చిన్న చిన్న పదాలే బరువైన భావోద్వేగాలను మోస్తాయని ఈ పాట గురించి రామ్ పోతినేని ట్వీట్ చేశారు. 


Nuvvunte Chaley Full Song Release Date Time: జూలై 18న 'నువ్వుంటే చాలే' సాంగ్ విడుదల చేస్తామని ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు టైమ్ కూడా చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5.04 గంటలకు లిరికల్ వీడియో విడుదల కానుంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్ పాడటం విశేషం. వివేక్ - మెర్విన్ ద్వయం సాంగ్ కంపోజ్ చేశారు. చిత్రానికి వాళ్లిద్దరూ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


Also Read: పవన్‌ కళ్యాణ్‌తో ఒక్క సినిమా... వంద సినిమాలతో సమానం - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ






'ఆంధ్రా కింగ్ తాలూకా'కు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. 


Also Readబాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?


రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాకు కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి, నిర్మాతలు: నవీన్ యెర్నేని - వై. రవిశంకర్, నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, సంగీతం: వివేక్ - మెర్విన్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ నుని, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.