బీటెక్ కాలేజీలో ముగ్గురు కుర్రాళ్లు చేసే అల్లరి, వాళ్ల కథలు ప్రధానంగా తెరకెక్కిన సినిమా 'మ్యాడ్'. బాక్సాఫీస్ బరిలో సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా విడుదల తేదీ ముందుకు వచ్చిందని టాక్. 


క్రిస్మస్ కాదు... నవంబర్ నెలలో!
'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ మరోసారి సందడి చేయనున్నారు. సీక్వెల్‌ను కూడా 'మ్యాడ్' రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన 'లడ్డు గాని పెళ్లి' చార్ట్ బస్టర్ అయ్యింది. మరి, లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?






నవంబర్ నెలలో 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ సీజన్ సందర్భంగా సినిమా విడుదల విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గనుక వాయిదా పడితే ఈ సినిమాను తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కానీ, క్రిస్మస్ రిలీజ్ పక్కా అని 'దిల్' రాజు కన్ఫర్మ్ చేయడంతో 'మ్యాడ్ 2' విడుదలను ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. నవంబర్ నెలలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.


Also Readఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్... హెల్త్ అప్డేట్ ఇచ్చిన సతీమణి లత



'మ్యాడ్'కు యువ తెలుగు సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన బాణీలు, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. అందులో పాటలు ఇప్పటికీ వినబడుతున్నాయి. 'కాలేజీ పాప' గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 'మ్యాడ్ స్క్వేర్'కు కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌ దత్ కెమెరా బాధ్యతలు... జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. 'మ్యాడ్'లో అందాల భామలు ఇందులోనూ ఉంటారా? లేదంటే కొత్త అమ్మాయిలు వస్తారా? అనేది చూడాలి. 


Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?






ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థలపై హారిక సూర్యదేవర, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.