Rajamouli: తారక్ సూపర్ కంప్యూటర్, చరణ్ వైట్ కాన్వాస్ - నటనలో ఇద్దరి మధ్య తేడా ఏంటో చెప్పిన రాజమౌళి

Interesting facts - RRR movie shooting: యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య వ్యత్యాసం ఏంటి? ఇద్దరి గురించి రాజమౌళి ఏం చెప్పారు? 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయంలో ఏం జరిగింది?

Continues below advertisement

Rajamouli reveals difference between NTR and Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. ఈ సినిమా కంటే ముందు హీరోలు ఇద్దరితో రాజమౌళి పని చేశారు. వేర్వేరు సినిమాలు తీశారు. 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ'... ఎన్టీఆర్ హీరోగా మూడు సినిమాలు చేశారు. రామ్ చరణ్‌తో 'మగధీర' చేశారు. అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటి? యాక్టింగ్ పరంగా ఎవరి స్టైల్ ఏంటి? అనే అంశాల గురించి రాజమౌళి మాట్లాడారు.

Continues below advertisement

"ఒక్క ముక్కలో చెప్పాలంటే తారక్ సూపర్ కంప్యూటర్ లాంటోడు (Rajamouli compares NTR to Super Computer). నేను ఒక్క వాక్యం చెబితే... తను రెండు మూడు వాక్యాలు ఊహించుకుని 'ఎలా నటించాలి? ఏం చేయాలి?' అని డిసైడ్ అయిపోయి కావాల్సింది చేస్తాడు. అదొక వర్కింగ్ స్టైల్. తారక్ ఏం చేస్తాడో నాకు తెలుసు. ఒక్క లైన్ రాసుకుంటే... ఒక్క పాజ్ ఇస్తాడని, ఇక్కడ ఇలా నడిస్తాడని నాకు తెలుసు. నేను ఏది అయితే ఊహించుకుంటానో, యాజ్ ఇట్ ఈజ్ అలా చేస్తాడు. రామ్ చరణ్‌తో కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. కొన్నేళ్లుగా నమ్మడం నేర్చుకున్నాడు. బోలెడు విషయాలు మనసులో పెట్టుకోవడం లేదు. క్యారెక్టర్ ఏంటి? ఎలా నటించాలి? అనేది అతడికి తెలుసు. షూటింగ్‌కు వచ్చే సరికి... క్లీన్ వైట్ కాన్వాస్ లా (Ram Charan comes to sets as white canvas, says Rajamouli) వస్తున్నాడు. 'ఆ కాన్వాస్ మీద మీరు ఏ పెయింటింగ్ కావాలంటే ఆ పెయింటింగ్ వేసుకోండి' అన్నట్టు ఉంటున్నాడు. అప్పుడు చాలా కష్టం. పాత్ర గురించి అంతా తెలిసినప్పుడు... అదంతా మైండ్ లోంచి తీసేసి 'ఏం తెలియదు. నేను తెల్ల కాగితంలా మీ దగ్గరకు వచ్చాను'అన్నట్టు ఉంటే... నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంతకు ముందు చరణ్ అలా కనిపించేవాడు కాదు. ఒక విధంగా అది మెడిటేషన్. చరణ్ నన్ను చాలాసార్లు స‌ర్‌ప్రైజ్‌ చేశారు" అని రాజమౌళి చెప్పారు.

Also Read: మనం ఆ స్థాయి దాటేశాం, ప్రేక్షకులూ ప్రిపేర్ అయ్యారు! - ఎన్టీఆర్

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

Also Read: ఉక్రెయిన్‌లో సెక్యూరిటీకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన రామ్ చరణ్

Continues below advertisement