Mahesh Babu : ఆగస్టులో మహేష్ బాబు సినిమా సెట్స్ మీదకు వెళుతుందా? లేదా?

Tollywood Bandh, SSMB 28 To Be Effected : ఆగస్టు 1 నుంచి షూటింగులు బంద్ చేయాలని టాలీవుడ్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. మరి, ఆగస్టులో స్టార్ట్ కానున్న మహేష్ కొత్త సినిమాపై ఉంటుందా? ఉండదా?

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో ఉంది. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ ఆల్మోస్ట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఆగస్టు 15 లేదా 16వ తేదీల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Continues below advertisement

ఆగస్టులో మహేష్ బాబు సినిమా సెట్స్ మీదకు వెళుతుందా? లేదా? ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అనుకున్న తేదీకి స్టార్ట్ అవుతుందా? లేదా? అని కొత్త చర్చ మొదలైంది. దీనికి కారణం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయం. ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాము తీసుకున్న నిర్ణయాలు అమలు చేసేవరకూ సెట్స్ మీదకు వెళ్ళకూడదని భావిస్తున్నారు. అందుకని, మహేష్ సినిమాపై బంద్ ఎఫెక్ట్ ఉంటుందని ఇండస్ట్రీ భావిస్తోంది.

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాపై బంద్ ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఆగస్టు 1న స్టార్ట్ కానున్న బంద్ వారం లేదంటే పది రోజుల్లో ముగుస్తుందని... ఆగస్టు రెండో వారం తర్వాత స్టార్ట్ కానున్న SSMB 28 షూటింగుకు ఎటువంటి అవాంతరాలు ఉండవని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. అదీ సంగతి!

Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు

పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi)  కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.

Also Read : రేప్ చేస్తామన్నారు, చంపేస్తామన్నారు! ర‌ణ్‌వీర్‌ను సపోర్ట్ చేయడానికి నన్ను లాగడం ఎందుకు? - ఉర్ఫీ జావేద్

Continues below advertisement