గుప్పెడంతమనసు జులై 27 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 27 Episode 513)


పెన్ డ్రైవ్ పారేసిన వసుధారకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది సాక్షి.
రిషి: తప్పుచేసిన వారికి శిక్ష తప్పకుండా వేయాలి సాక్షి. శిక్షంటూ వేయాల్సి వస్తే నాకు వేయాలి అని షాకిస్తాడు. ఏం శిక్ష వేసుకోవాలో చెప్పు
సాక్షి: ఏం మాట్లాడుతున్నావ్ సాక్షి..నీకు శిక్ష వేయడం ఏంటి..
రిషి: ఈ పెన్ డ్రైవ్ నిజానికి నేను వసుధారకి ఇవ్వనే లేదు. ఇచ్చానేమో అనుకున్నాను..ఏంటి వసుధార నువ్వు మర్చిపోయావా . మొదట నీకు పెన్ డ్రైవ్ ఇచ్చాను మళ్లీ నేనే తీసుకున్నాను..
సాక్షి: రిషి నువ్వు బాగా ఆలోచించి చెప్పు..
రిషి: సాక్షి..జరిగిందేంటో నాకు తెలుసు, వసుకి తెలుసు...పెన్ డ్రైవ్ మిస్సైంది అనుకో దానికి సంబంధించి నేను అరవాలి, ఏదైనా యాక్షన్ తీసుకుంటే నేను తీసుకోవాలి..మధ్యలో నువ్వెందుకు ఇంతలా రియాక్టయ్యావో అర్థంకాలేదు
సాక్షి: రిషి నేను ప్రాజెక్ట్ కోసం..
రిషి: ప్రాజెక్ట్ కోసం ఏం చేయాలో నాకు తెలుసు..నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు..
సాక్షి: ఈ విషయంలో నేను ఆవేశపడి ఉంటే సారీ..
రిషి: సారీ చెప్పాల్సింది నాకు కాదు..చెప్పాల్సిన వాళ్లకి చెప్పాలి..


Also Read: వసుధార కన్నీళ్లు చూసి అల్లాడిపోయిన రిషి, రెచ్చిపోయిన సాక్షికి ఇచ్చి పడేసిన గౌతమ్


ఏదో ఆలోచిస్తూ రిషి క్యాబిన్ కి వెళ్లిన వసుధార..రిషి సార్ పెన్ డ్రైవ్ ఇచ్చారు కదా అసలేం జరిగింది అని ఆలోచిస్తుంది. నాకిచ్చిన పెన్ డ్రైవ్ రిషి సార్ చేతికి పెన్ డ్రైవ్ ఎలా వచ్చింది..సార్ ఎలాగూ పిలిచి తిడతారు ముందే రావడం బెటర్ కదా అందుకే వచ్చాను అనుకుంటుంది..ఇంతలో రిషి క్యాబిన్ కి వస్తాడు..
రిషి: అసలేంటి వసుధార నువ్వు
వసు: పెన్ డ్రైవ్ ఎలా దొరికింది సార్
రిషి: నువ్వు పోగొట్టుకున్నావ్ కాబట్టి దొరికింది..నాకు కావాల్సింది మాత్రం పోగొట్టుకున్నాను
వసు: మనిద్దరి చేతిలోనే ఉంది కదా పోగొట్టుకోవడం అనరు..చేతులు మారడం అంటారు. ఆ పెన్ డ్రైవ్ మీరిచ్చారు, ఇవ్వలేదని నన్ను కాపాడారు..మళ్లీ మీకే ఎలా దొరికిందిసార్.. ( వసు చేతికి ఇచ్చినపెన్ డ్రైవ్ బ్యాగులో పెట్టబోయి కింద పడేసి వెళ్లిపోతుంది..అది తీస్తాడు రిషి)
రిషి: నీకెందుకింత పరధ్యానం, అంత బాగా అర్థమయ్యేలా చెప్పాను కదా అలా ఎలా పారేసుకున్నావ్..
వసు: మీకే దొరికింది కదా
రిషి: నాకు దొరక్కపోతే పరిస్థితేంటి చెప్పు..ఇంతకుముందులా బాధ్యతగా, భయంగా ఉండడం లేదు. ఏదో తెలియని నిర్లక్ష్యం కనిపిస్తోంది..నాపై గౌరవం తగ్గిందా, గౌరవమే పోయిందా..
వసు: సార్..చిన్న పెన్ డ్రైవ్ కోసం..
రిషి: షడప్ వసుధారా..చేసిందే తప్పు ఇచ్చిన పెన్ డ్రైవ్ పోగొట్టుకున్నావ్.అదెంత ముఖ్యమో చెప్పాను..అందరి ముందూ నిన్నెందుకు అవమాన పర్చడం అని కాపాడితే ఇక్కడకు వచ్చి చిన్న పెన్ డ్రైవ్ అంటావా. మామూలు స్టూడెంట్ ఇలాంటి తప్పు చేస్తే బాధపడేవాడినికాదు..అందరికీ ఆదర్శంగా ఉండే స్టూడెంట్ ఇలా ప్రవర్తిస్తుందా..
వసు: నాదే పొరపాటు సార్..నేను పెన్ డ్రైవ్ పోగొట్టాల్సింది కాదు..అది నిజంగానే మీకు దొరక్కపోతే మీరు ఇబ్బంది పడేవారు కదా సార్ అని ఏడుస్తుంది..
రిషి: ఏడవద్దు వసుధారా అని బతిమలాడుతాడు..ఇప్పుడేమైందని అంటూ కన్నీళ్లు తుడుస్తాడు రిషి...( నిన్ను హర్ట్ చేయడం నా ఉద్దేశంకాదు కానీ నీకీమధ్య పరధ్యానం ఎక్కువైంది)
మిమ్మల్ని ఎప్పుడూ హర్ట్ చేయను రిషి సార్ అనుకుంటుంది వసుధార..


Also Read: నిరుపమ్-శౌర్యకి ప్రైవసీ కల్పించిన హిమ, మోనితలా తాళి కట్టుకుంటానన్న శోభ
అందరం కలసి భోజనం చేస్తే బావుంటుంది కదా వదినా అంటూ రిషి దేవయానివైపు చూస్తుంటాడు.
దేవయాని: ధరణిని కొత్తగా చూస్తున్నాను..ఏం జగతి మాట్లాడవేంటి
జగతి: మీరు పెద్దవారు మీరు చెప్పింది వింటాం..
దేవయాని: మహేంద్ర నువ్వు మాట్లాడవేంటి
మహేంద్ర: మీరు మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడతాను
దేవయాని: ఎడ్యుకేషన్ సమ్మిట్ కి సాక్షి చాలా ఉపయోగపడుతోంది కదా... సాక్షి ముందు వసు తెలివితేటలు ఎందుకూ పనికిరావు..
రిషి:  తిన్న ప్లేట్ లో చేయి కడిగేసుకుని ..సారీ మీరు కంటిన్యూ చేయండని వెళ్లిపోతాడు...
జగతి-మహేంద్ర ఏమీ మాట్లాడలేక ఊరుకుంటారు..
సోఫాలో కూర్చుని రిషి ఆలోచిస్తుండగా సాక్షి కాల్ చేస్తుంది...వసుధార ఎంట్రీ ఇస్తుంది...
ఈ టైమ్ లో సాక్షికాల్ చేసిందేంటి అనుకుంటుంది వసుధార.. నీతో కబుర్లు చెప్పాలని కాల్ చేశాను అంటుండగా గుడ్ నైట్ అని కాల్ కట్ చేస్తాడు రిషి. బయటకు వెళ్లిపోదాం అని వసుధార వెనుతిరుగుతుండగా రిషి చూసి పిలుస్తాడు...
రిషి: ఎప్పుడు ఏం చేయాలో తెలియదా నీకు..ఇప్పుడేం వర్క్ చేస్తావ్..ఉండు కారు కీస్ తీసుకొస్తాను
వసు: ఉండమని చెప్పాను కదా అని లోపలకు వెళతాడు రిషి..


Also Read: రాయలేని కవితలు అన్నీ కళ్లతోటి పలికిస్తున్నా అన్న వసు, పనిష్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైన రిషి
దేవయానికి కాల్ చేసిన సాక్షి..రిషికి ఎందుకు నాపై కోపం అని మాట్లాడుతుంటుంది...  వసుధారని చూసిన దేవయాని.. వసుతో కలసి రిషి బయటకు వెళుతున్నాడు అని చెప్పి..ఇదో మంచి అవకాశం వాడుకో సాక్షి అని కాల్ కట్ చేస్తుంది...
రిషి: రాత్రి పూట ఇలా వచ్చేసింది..తిన్నాదో లేదో తెలియదు..గట్టిగా ఏమైనా అంటే బాధపడుతుంది..
వసు: చదువుల పండుగ వర్క్ ని వాయిదా వేయడం ఇష్టం లేదు
రిషి: భోజనం చేశావా లేదా..
వసు: రూమ్ కి వెళ్లి తింటానులెండి..
రిషి: గతంలో నాకు ఓ గురువుగారు భోజనంగురించి గొప్ప ఉపన్యాసం ఇచ్చారులే..
వసు: ప్రతీదానికి మినహాయింపులు, సడలింపులు ఉంటాయి కదా..
రిషి: ఆరోగ్యాన్ని చూసుకోవాలి కదా..
వసు: నేను తింటాను లెండి..మీరు తిన్నారా...
రిషి: వసుధార నిజంగా చదువుల పండుగ పనిమీదే వచ్చిందా, ఇంకేదైనా కారణం ఉందా తెలుసుకోవాలి
వసు: నేను వచ్చింది చదువుల పండుగ పనిమీదే అయినా..మిమ్మల్ని చూడాలని వచ్చాను..ఈ రోజు నా మనసులో మాటచెప్పాలి..
కారెక్కుతూ...తూలి పడబోయిన వసుని పట్టుకుంటాడు రిషి...అప్పుడే వచ్చి చూస్తుంది దేవయాని...ఈ వసుకి ఉన్న తెలివిలో ఆ సాక్షికి సగం ఉన్నా బావుండేది అనుకుంటూ..రిషి అని గట్టిగా అరుస్తుంది దేవయాని. ఈ టైమ్ లో ఎక్కడికి వెళుతున్నారని అడుగుతుంది.. తను కాలేజీ పనిపై వచ్చింది రూమ్ దగ్గర దింపేసి వస్తానంటాడు. ఈ టైమ్ లో ఇంటికి రాకపోతే ఏంటి చెప్పు అనగానే కాలేజీ పనేకదా అంటాడు. క్యాబ్ బుక్ చేయి రిషి అని దేవయాని అంటే..మేడం అన్ని పనులూ ఫోన్లోనే అవవు కదా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ముందడుగు వేయాలి మేడం అని సమాధానం చెబుతుంది...


ఎపిసోడ్ ముగిసింది.