గుప్పెడంతమనసు జులై 26 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 26 Episode 512)
రిషి-సాక్షి స్టోర్ రూమ్ లో ఉండగా వీడియో తీసి బయటకు వస్తున్న సాక్షికి గౌతమ్ ఎదురవుతాడు. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని మొదలు పెట్టి, లండన్లో ఎక్కడుండేవారు, ఏం చేసేవారు, చదువు మధ్యలో ఆపేసి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు.
సాక్షి: మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా
గౌతమ్: నన్ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండీ.. చదువుల పండుగలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కంగ్రాట్స్ చెబుతున్నాడు గౌతమ్
సాక్షి: మీ పేరు గౌతమా
గౌతమ్: ఇన్నాళ్లూ చూస్తున్నారు ఇప్పటికీ తెలియదా
సాక్షి: రోడ్డుపై వెళ్లేవారిని పట్టించుకోం..
గౌతమ్: చదువుల పండుగ గురించి డౌట్స్ ఉన్నాయి కానీ అవి మీరు తీర్చలేరులే..ఇంకెవరైనా తెలివైన వాళ్లని అడుగుతాను
సాక్షి: ఏంటి గౌతమ్ కి కూడా చులకనయ్యానా..అందరికీ తగిన సమాధానం ఇస్తాను
అటెండర్ శివ బ్యాగ్ తీసుకుని వెళుతుండగా ఆపిన రిషి.. ఈ బ్యాగ్ ఎవరిది అని అడుగుతాడు. వసుధార మేడంది సార్ ఇందులో బ్యాడ్జెస్ తీసేసి బ్యాగ్ క్లాస్ రూమ్ కి తీసుకెళుతున్నా అంటాడు.
Also Read: రాయలేని కవితలు అన్నీ కళ్లతోటి పలికిస్తున్నా అన్న వసు, పనిష్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైన రిషి
క్లాస్ రూమ్ కి వచ్చిన రిషి..వసు బ్యాగ్ లో ఉన్న కలర్ చాక్ పీసెస్ చూస్తాడు. ఆ తర్వాత వెళ్లి వెనుక బెంచ్ లో కూర్చుని ఏదోచదువుతుంటాడు. బుక్ కిందపడడంతో వంగితీసుకుంటుండగా వసుధార వస్తుంది. వెనుకే ఉన్న రిషిని చూసుకోకుండా ఏంటి పుష్పా రిషి సార్ రాలేదా..సమయ పాలన అంటారు కదా ఇంకా రాలేదేంటి..రానీ ఈ రోజు నేను పనిష్మెంట్ ఇస్తానంటుంది. ఇంతలో వెనుకే వచ్చిన రిషి అంత్యాక్షరి మొదలెడదమా అని సెటైర్ వేస్తాడు.
రిషి: బోర్డుపై ఎవరో కళాఖండాన్ని చిత్రీకరించారు..దాన్ని చెరిపేస్తే కానీ క్లాస్ చెప్పలేం కదా అంటాడు. ఈ బొమ్మ బానే ఉంది కానీ చెరిపేయక తప్పదంటూనే చెరిపేస్తాడు.. వద్దు సార్ అంటూ వసు కళ్లు మూసుకునికూర్చుటుంది..ఇంతలో వెనక్కు తిరిగిన రిషి ఇలా బోర్డుపై బొమ్మలు గీయడం తప్పు ఎవరు గీశారో వాళ్లే ఈ బొమ్మను చెరిపేయండి. వచ్చి చదువుల పండుగ గురించి చెప్పు వసుధార అంటాడు. వసు దగ్గరకు వచ్చిన తర్వాత నీ కళా ప్రదర్శన ఇక్కడ చూపించకు ఆ బొమ్మను చెరిపెయ్ అనేసి వెళ్లిపోతాడు..క్యాబిన్ కి వెళ్లిపోయిన తర్వాత కూడా వసు గురించే ఆలోచిస్తాడు. నువ్వు ఎప్పటికీ అర్థం కాని చిక్కులెక్కవా అనుకుంటాడు. క్యాబిన్ కి వచ్చిన వసుతో అప్పుడే చదువుల పండుగ కాన్సెప్ట్ గురించి స్టూడెంట్స్ కి చెప్పేశావా అంటాడు. నెమలి ఫించం అనగానే దాని గురించి చర్చ అనవసరం అన్న రిషి.. చదువుల పండుగ గురించి నీకు బాధ్యత అప్పగించాలని అనుకుంటున్నాను
వసు: చెప్పండి సార్ చేస్తాను
రిషి: చదువుల పండుగకు సంబంధించిన అన్ని వివరాలూ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి..ఎప్పటికప్పుడు ఇది అప్ డేట్ చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ వి నేను అనుకున్నవి నా దగ్గర ఉండవు ఏంటో మరి. నేను పారేసుకోవడం కాదు వాటంతట అవే దూరమైపోతాయి.
వసు: సర్..కొన్ని మననుంచి దూరమైపోయినా అవి తిరిగి రావొచ్చు కదా..అంటే మీరేదో వస్తువు పోగొట్టుకున్నాను అనుకున్నారు కదా పోయిన వస్తువు దొరుకుతుంది కదా..
రిషి: పోగొట్టుకోవడం అలవాటైపోయిందేమో..ఈ పెన్ డ్రైవ్ కూడా అలా పోతుందేమో అని నీకు ఇస్తున్నాను వసుధార..
వసు: మీరిచ్చిన ప్రతీదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను సార్... అదే సర్ పెన్ డ్రైవ్..
రిషి: చూడు వసుధార..ఈ చదువుల పండుగను సీరియస్ గా తీసుకోవాలి. నువ్వెంత సీరియస్ గా తీసుకుంటున్నావో క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ చెబుతోంది. ఈ ప్రాజెక్టుతో మనం డీబీఎస్టీ కాలేజీ పేరును మరింత పెరిగేలా చేయాలి.పెన్ డ్రైవ్ జాగ్రత్త అని మళ్లీ చెబుతాడు..
Also Read: హిమ-నిరుపమ్-శౌర్య అంతా ఒకే ఇంట్లో, ఊహల్లో తేలుతున్న ప్రేమ్ -మరో కుట్రకు సిద్ధమైన శోభ
మేడం ఈ వర్క్ చూడండి అంటూ ఇస్తుంది జగతి మేడం. నీకు టాలెంట్ ఉంది కానీ వర్క్ పై కాన్సన్ ట్రేట్ చేయలేకపోతున్నావు. నువ్విక్కడకు ఎందుకు వచ్చావో తెలుసు..దాపరికం ఎందుకు ఆంటీ నేను వచ్చింది రిషి కోసమే..
సాక్షి: కొన్ని రోజుల వరకూ నేనంటే మండిపడే రిషి..ఇప్పుడు బాగానే ఉంటున్నాడు
జగతి: నీకో విషయం చెబుతాను..ఓ మనిషిపై కోపం, ఇష్టం, ద్వేషం చూపిస్తున్నామంటే ఆ మనిషి ఇష్టం అని అర్థం. నువ్వు ఆ హోదా కోల్పోయావ్
సాక్షి: ఇప్పుడు వచ్చానుకదా
జగతి: రాలేదు రాబడ్డావ్. నీకు వయసు ఉంది, తెలివి ఉంది కానీ ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సెన్స్ లేదు. అదుంటే ఇలా బిహేవ్ చేయవు. నీకు నేనిచ్చే అడ్వైజ్ ఒక్కటే...ఎవరో చెప్పింది విని నీ మనశ్సాక్షిని మోసం చేసుకోకు. నువ్వు చేసే పన్నాగాలకు నిన్ను నడిపించే దుష్ట శక్తులకు దూరంగా ఉండు...
సాక్షి: ఆంటీ రిషితో మీటింగ్ టైమ్ మరిచిపోయారు వెళదామా...
Also Read: స్టోర్ రూమ్ లో వలలో చిక్కుకున్న రిషి-వసు, వీడియో షూట్ చేసి కుట్రకు తెరతీసిన సాక్షి
అందరూ మీటింగ్ రూమ్ లో కూర్చుంటారు...చదువుల పండుగ గురించి డిస్కస్ చేసుకుంటారు.వసుని పెన్ డ్రైవ్ అడుగుతాడు. ఎప్పటిలా లేదు సార్ అంటుంది.
సాక్షి: భయమో, భక్తో కాలేజీ అంటే గౌరవమో ఉంటే ఇలా పెన్ డ్రైవ్ పోగుడుతుందా..
వసుధారా ఏమైందని రిషి అడిగితే కనిపించడం లేదంటుంది వసుధార
సాక్షి: కనిపించదు వసుధారా పోయింది.. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నది ఎక్కడా కాపీ చేయలేదా
రిషి: లేదు
వసు: ఇలాంటి రెస్పాన్స్ బిలిటీ లేనివారిని పెట్టుకుని చదువుల పండుగ ఎలా చేస్తావ్
సాక్షి: రిషి నీకింకా అర్థంకాలేదా..నిర్లక్ష్యం..వాళ్లు నాకు సన్మానం చేశారు, అవార్డులు లొచ్చాయని కొమ్ములొచ్చాయి..
జగతి: సాక్షి..ఈ టాపిక్ కి నీకు సంబంధం లేదుకదా
సాక్షి: ఇక్కడున్న వాళ్లందరకీ ప్రాజెక్ట్ తో సంబంధం ఉంది కదా..ఇలాంటి తప్పు ఇంకోసారి చేయకుండా ఉండాలంటే పనిష్మెంట్ ఇవ్వాలి కదా
రిషి: తప్పకుండా ఇశ్తాను..
రేపటి( బుధవార) ఎపిసోడ్ లో
అసలేంటి వసుధారా..నువ్వు ఇంతకుముందులా బాధ్యతలా, గౌరవంగా ఉండడం లేదన్న రిషితో ఓ చిన్న పెన్ డ్రైవ్ కోసం అనగానే షడప్ వసుధార అని అరుస్తాడు. తను ఏడవడం చూసి బాధపడిన రిషి ఏంటిది అంటూ కన్నీళ్లు తుడుస్తాడు.
Also Read: లగేజ్ తీసుకుని అత్తారింటికి వచ్చేసిన నిరుపమ్-షాక్ లో సౌందర్య కుటుంబం, శోభ ఈవిల్ ప్లాన్