Lakshmi Nivasam Serial April 28th Episode Promo Review: శ్రీనివాస్ ఫ్యామిలీని నడిరోడ్డు మీదకు లాగేందుకు భార్గవ్ వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది. అతనికి అప్పిచ్చిన ఫైనాన్షియరే స్వయంగా వారి ఇంటికి వచ్చి శ్రీనివాస్ కాళ్ల మీద పడి క్షమించమని ప్రాధేయపడతాడు. ఇంటి పత్రాలు అందించి అప్పు ఏమీ లేదని అంటాడు. విషయం అర్థం కాక లక్ష్మి, శ్రీనివాస్‌తో పాటు తులసి, జాను కూడా ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందని ఫైనాన్షియర్‌ను అడుగుతారు. 

Continues below advertisement


శ్రీనివాస్ ఫ్యామిలీకి అండగా జై..


ఓ విజిటింగ్ కార్డ్ వారి చేతికి ఇచ్చిన ఫైనాన్షియర్ అక్కడకు వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయని.. అంటాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన లక్ష్మి, శ్రీనివాస్‌లు ఆ అడ్రస్‌కు వెళ్తారు. అక్కడ వారికి సాదరంగా స్వాగతం పలకడం చూసి ఆశ్చర్యపోతారు. ఓ రూంలో ఉండగా జై వారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు. దీంతో అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. తన భార్య పేరు మీద ఇల్లు కట్టడం తన జీవితాశయం అంటూ శ్రీనివాస్.. జైతో చెప్తాడు. ఇదే సమయంలో జానుతో పెళ్లి విషయం ప్రస్తావిస్తాడు జై. తనకు జాను అంటే చాలా ఇష్టమని.. మీ కుటుంబం తోడు కావాలని అంటాడు. దీంతో లక్ష్మీ, శ్రీనివాస్ ముచ్చటపడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు.


జైతో పెళ్లికి జాను ఓకే..


ఇంటికి వచ్చిన లక్ష్మి, శ్రీనివాస్‌లను అసలు మనకు హెల్ప్ చేసింది ఎవరు? అని కుతూహలంతో అడుగుతారు ఫ్యామిలీ మెంబర్స్. తమను జైలు నుంచి బయటపడేసింది. ఫైనాన్షియర్ నుంచి ఇంటిని విడిపించింది జై బాబే అని చెప్తారు. దీంతో జానుతో పాటు అంతా ఆశ్చర్యపోతారు. ఎంత ఎదిగినా వినయంతో ఉన్నాడంటూ జైను పొగిడేస్తుంది లక్ష్మి. అతనితో పెళ్లి విషయం ఏం చెప్పాలి అన్నట్లుగా జానును అడుగుతారు.


అయితే, ఈ విషయంలో ముభావంగా ఉన్న జాను లోపలికి వెళ్లిపోతుంది. ఈ విషయంపై తులసి జానును అడగ్గా.. నీకు పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో తులసి.. తన గురించి ఆలోచించొద్దని.. జై చాలా మంచి వారని పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇస్తుంది. దీనిపై ఆలోచించిన జాను.. జైతో తనకు పెళ్లి ఇష్టమేనని.. లక్ష్మీ, శ్రీనివాస్‌లతో చెప్తుంది. దీంతో వారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. 


మరోవైపు, జానుకు ఎందుకు ప్రపోజ్ చేయడం లేట్ అయ్యిందంటూ విశ్వను అడుగుతారు అతని ఫ్రెండ్స్. ఈ క్రమంలో పాత విషయాలు తలుచుకుని బాధ పడుతుంచాడు విశ్వ. జై అసలు మంచివాడా కాదా? అనేది తెలుసుకోవాలంటూ విశ్వకు సలహా ఇస్తారు అతని ఫ్రెండ్స్. అతని నిజ స్వరూపాన్ని జానుకి, ఆమె ఫ్యామిలీకి తెలియజేస్తే పెళ్లి క్యాన్సిల్ అవుతుందంటూ చెప్తారు. ఇందుకోసం ఓ డిటెక్టివ్ హెల్ప్ తీసుకుందామని అంటారు. దీనికి విశ్వ ఓకే అంటాడు.


అసలు విశ్వ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?, జైతో పెళ్లికి ఓకే చెప్పిన జాను ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది?, అటు తులసి దృష్టిలో మంచివాన్ని అనిపించుకోవాలన్న సిద్ధు కోరిక నెరవేరుతుందా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.