Nithiin's Robinhood movie release date announced: నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'రాబిన్ హుడ్'. 'భీష్మ' విజయం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. 


డిసెంబర్ 20న 'రాబిన్‌హుడ్' విడుదల
Robinhood arriving on Dec 20th: డిసెంబర్ 20వ తేదీన 'రాబిన్‌హుడ్' సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు అనౌన్స్ చేశారు. సాధారణంగా కొత్త సినిమాలను శుక్రవారం విడుదల చేయడం ఆనవాయితీ. అయితే, ఈ మధ్య హాలిడేస్ వంటి చూసుకుని లాంగ్ వీకెండ్ సీజన్ రిలీజ్ కోసం చేస్తున్నారు.


Also Readఅల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!






డిసెంబర్ 20 శుక్రవారమే. అయితే... 25వ తేదీ బుధవారం వచ్చింది. క్రిస్మస్ సీజన్ (Telugu Movies Releasing On Christmas 2024) హాలిడేస్ మీద ముందుగా కర్చీఫ్ వేశారు నితిన్. లాంగ్ వీకెండ్ కావడంతో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!



ఘరానా మోసగాడిగా నటిస్తున్న నితిన్!
'రాబిన్ హుడ్' సినిమాలో నితిన్ కాన్ మ్యాన్ (ఘరానా మోసగాడు) రోల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌లో డబ్బునోళ్ల దగ్గర ఆ సంపద దోచుకునే యువకుడిగా నితిన్ పాత్రను చూపించారు.


Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే



డబ్బు చాలా చెడ్డదని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య రూపాయి చిచ్చు పెడుతుందని 'రాబిన్ హుడ్' గ్లింప్స్‌లో చూపించారు. ''దేశమంత కుటుంబం నాది.  ఆస్తులు ఉన్నోళ్లంతా నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే? ఫ్యామిలీ మెంబెర్ అని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు'' అని నితిన్ చెప్పే మాట అందర్నీ ఆకట్టుకుంది. కేసులు పెట్టినా హార్ట్ అవ్వలేదని, వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం తన హక్కు అని నితిన్ చెప్పారు. ఆయన క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చారు. మరి సినిమాలో ఆయన ఎవరి దగ్గర దోచుకుంటారనేది చూడాలి. 


'రాబిన్ హుడ్'లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కథానాయికగా రష్మికను ఎంపిక చేశారు. డేట్స్ అడ్జెస్ట్ కాక ఆమె తప్పుకొన్నారు. ఆ తర్వాత శ్రీలీల, రాశీ ఖన్నా పేర్లు వినిపించాయి. అయితే... ఇంకా అధికారికంగా చిత్ర బృందం వెల్లడించింది.