గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ సిటీలోని ఓ స్టూడియోలో ఘనంగా చిత్రాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 


బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి!
కథానాయకుడిగా బాలకృష్ణ 109వ చిత్రమిది (nbk 109). ప్రారంభోత్సవంలో నట సింహంతో మాటల మాంత్రికుడు సందడి చేశారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్‌బికె ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ తదితరులు హాజరయ్యారు. 


Also Read : అమెరికాలో ఆదిపురుషుడు - అభిమానులకు ఓ బంపర్ ఆఫర్










సంక్రాంతి బరిలో... మొన్న జనవరి నెలలో విడుదలైన తెలుగు సినిమాల్లో 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' ఉన్నాయి. మొదటి సినిమాలో హీరో బాలకృష్ణ కాగా... రెండో సినిమాకు బాబీ కొల్లి దర్శకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం. బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేశారట. 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవిని బాబీ ప్రజెంట్ చేసిన తీరు అభిమానులకు నచ్చింది. ఇప్పుడు బాలకృష్ణను సైతం అభిమానులు కోరుకునే విధంగా చూపించాలని డిసైడ్ అయ్యారట.


Also Read 'టక్కర్' రివ్యూ : మాస్ యాక్షన్ హీరో కావాలని సిద్ధార్థ్ ట్రై చేస్తే?



'భగవంత్ కేసరి'గా వచ్చిన బాలకృష్ణ
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు 'భగవంత్ కేసరి' టీజర్ కూడా విడుదల అయ్యింది. ఆ సినిమాలో హీరో ఇంటి పేరు నేలకొండ. హీరో పేరు భగవంత్ కేసరి. మొత్తంగా పలికితే నేలకొండ భగవంత్ కేసరి. షార్ట్‌గా ఎన్‌బికె. ఒరిజినల్ బాలకృష్ణ పేరు వచ్చేలా దర్శకుడు అనిల్ రావిపూడి హీరో పాత్రకు పేరు పెట్టారు. ఇప్పుడీ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 


బాలకృష్ణ మాస్ విధ్వంసం!
సాధారణంగా అనిల్ రావిపూడి పేరు చెబితే కామెడీ ఎక్కువ గుర్తుకు వస్తుంది. ఈ 'భగవంత్ కేసరి'తో ఆయన పక్కా మాస్ దర్శకుడి అవతారం ఎత్తారు. టీజర్ చూస్తే కమర్షియల్ పంథాలో తీశారని అర్థం అవుతోంది. 


'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్! విలన్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal)ను సైతం టీజర్‌లో చూపించారు. స్టార్టింగ్ విజువల్స్ చూస్తే... ఆయన ఓ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించారు. ఆ మంది మార్బలం చూస్తే సంపన్నుడు అని అర్థం అవుతోంది. తమన్ నేపథ్య సంగీతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.