పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా, సీత దేవి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మేకర్స్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.   


‘ఆదిపురుష్’పై  సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు


‘ఆదిపురుష్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటి కస్తూరి ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ చూస్తుంటే రాముడిలా కాకుండా, కర్ణుడిలా కనిపిస్తున్నారని వెల్లడించింది. రాముడు, లక్ష్మణుడు మీసాలు, గడ్డాలతో కనిపిండం ఏంటని ప్రశ్నించింది. ‘‘రామలక్ష్మణులను మీసాలు, గడ్డంతో చూపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి గెటప్ లో చూపించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది దిగ్గజ నటులు శ్రీరాముడి పాత్రను అద్భుతంగా చేశారు. ఆయన పాత్ర ఎంతో పరిపూర్ణంగా ఉండేది. కానీ, ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు” అని వ్యాఖ్యానించింది.  


కస్తూరి వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానుల విమర్శలు


కస్తూరి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా మాట్లాడుతుంటే, మరికొంత మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాముడిని మీసాలు, గడ్డంతో  చూడటంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. మూస ధోరణిలో రాముడిని చూసే వారికి ప్రభాస్ గెటప్ నచ్చకపోవచ్చు. కానీ, ఆ రూపే శ్రీరాముడిని యోధుడిగా చూపిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఈ చిత్రం ఓం రౌత్ రామాయణ పునఃకల్పన అని మర్చిపోకూడదన్నారు. సినిమా గురించి, సినిమాలో ప్రభాస్ గెటప్ గురించి వ్యాఖ్యానించే ముందు, కస్తూరి సినిమా గురించి మరింత తెలుసుకోవాలని సూచిస్తున్నారు.   


Read Also: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి



జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల


ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' దేశంలో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన చిత్రాల్లో ఒకటిగా నిలువబోతోంది. ‘ఆదిపురుష్’లో రాఘవగా ప్రభాస్, లంకేష్ గా సైఫ్ అలీఖాన్, జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, దేవదత్ నాగే హనుమంతుడిగా నటించారు. అజయ్-అతుల్ సంగీతం సమకూర్చారు. టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.  ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 3డీ, ఐమాక్స్ ఫార్మాట్స్ లో ఐదు భాషల్లో విడుదల కానుంది.  ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్రబృందం ‘ఆదిపురుష్‌’ సరికొత్త పోస్టర్లను ఒక్కొక్కటిగా సినీ ప్రియులతో పంచుకుంటోంది. ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.


Also Read : అమెరికాలో ఆదిపురుషుడు - అభిమానులకు ఓ బంపర్ ఆఫర్