ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు (Vadivelu), తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)... ఈ ఇద్దరు తండ్రి కుమారులుగా నటించిన సినిమా 'నాయకుడు' (Nayakudu Telugu Movie 2023). విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న తమిళ హిట్ 'మామన్నన్'కు తెలుగు అనువాదం ఇది. 


ట్రైలర్ విడుదల చేసిన మహేష్, రాజమౌళి!
'నాయకుడు' ట్రైలర్ (Nayakudu Trailer)ను సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే... 






''నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాటను నేను జీవితాంతం పాడుతూ ఉండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి... దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెతుకుతున్నాను'' అని వడివేలు చెప్పే మాటతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత ఊరి ప్రజలను ఫహాద్ ఫాజిల్ కొట్టడం కనిపిస్తుంది. కుక్కలు ఎవరినో తరుముతున్నాయి. 


చిన్న పిల్లల్ని ఫహాద్ ఫాజిల్ ఎందుకు కొడుతున్నారు? ఊరిలోకి వస్తే చంపేస్తారా? అని ఉదయనిధి స్టాలిన్ ఎవర్ని ప్రశ్నిస్తున్నారు? ఎవరిని అడ్డుకోవడానికి వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కూర్చున్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


'నాయకుడు' చిత్రానికి ధనుష్ 'కర్ణన్' ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తన సినిమాల్లో బలహీన వర్గాలను అగ్ర వర్ణ ప్రజలు ఎలా అణిచివేశారు? అనేది చూపిస్తారు. ఈ సినిమాలోనూ అటువంటి అంశాలను స్పృశించారని అర్థం అవుతోంది. 



జూలై 14న 'నాయకుడు'గా 'మామన్నన్'
Maamannan as Nayakudu in Telugu : తమిళనాట థియేటర్లలో జూన్ 29న 'మామన్నన్' విడుదల కాగా... ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. జూలై 14న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి.


Also Read : మై డియర్ మార్కండేయ - మామ అల్లుళ్ళ పాట రెడీ!


'నాయకుడు' అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాజశేఖర్, నమిత జంటగా నటించిన ఓ సినిమాకు కూడా ఆ టైటిల్ పెట్టారు. కమల్ 'నాయకుడు' కల్ట్ హిట్. మరి, ఉదయనిధి స్టాలిన్ సినిమాకు తెలుగులో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.


Also Read ఆగస్టులో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల 'ఆదికేశవ' విడుదల - ఎప్పుడంటే?


'నాయకుడు'లో ఎవరెవరు ఉన్నారు?
వడివేలు (Vadivelu) 'నాయకుడు'లో ప్రధాన పాత్ర పోషించారు. హీరోతో పాటు ఆయనది సమానమైన పాత్ర, తండ్రి పాత్ర. టైటిల్ పాత్రధారి ఆయనే. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా వడివేలు కనిపిస్తారు. ఇంకా ఈ సినిమాలో మహానటి కీర్తీ సురేష్, 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన మలయాళ కథానాయకుడు ఫహాద్ ఫాజిల్ ఉన్నారు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial