నాటకం... ఈ సినిమా ఓ సంచలనం. రా అండ్ రస్టిక్ తెలుగు సినిమాల్లో ఇదీ ఒకటి. హీరోగా ఆశిష్ గాంధీ (Ashish Gandhi)కి పేరు, గుర్తింపు తెచ్చిన సినిమా. 'నాటకం' తర్వాత 'డైరెక్టర్', 'ఉనికి', 'రుద్రంగి' సినిమాల్లో ఆయన నటించారు. ప్రజెంట్ 'హద్దు లేదురా' అని ఫ్రెండ్షిప్ బేస్డ్ కథతో ఓ సినిమా చేస్తున్నారు. అది కాకుండా తనకు 'నాటకం' వంటి సెన్సేషనల్ ఫిల్మ్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ (Kalyanji Gogana) దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి 'కళింగరాజు' టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
నెత్తురు నిండిన కత్తి పట్టిన ఆశిష్ గాంధీ
Ashish Gandhi First Look In Kalinga Raju: 'నాటకం' తర్వాత ఆ సినిమా హీరో ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ చేస్తున్న 'కళింగ రాజు' సినిమా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంస్థలపై తెరకెక్కుతోంది. రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: జగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!
'కళింగ రాజు' ఫస్ట్ లుక్ చూస్తే... ఆశిష్ గాంధీ మరోసారి రా & రస్టిక్ రోల్ చేసినట్లు అర్థం అవుతోంది. పల్లెటూరి నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్లు ఉన్నారు. ఓ కుర్చీలో ఆశిష్ గాంధీ కూర్చుని ఉండగా, ఆయన చేతిలో ఉన్న కత్తి నెత్తురుతో నిండింది. కుర్చీ పక్కన ఓ పాల క్యాన్ ఉంది. దాని మీద రక్తం ఉంది. ఆయన వెనుక గేదెలు, ఓ షెడ్ కనిపిస్తున్నాయి. ఉదయం గేదెల నుంచి పాలు తీయడం లేదంటే తీసిన పాలు తీసుకువెళ్లే క్రమంలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్సులో స్టిల్ అయ్యి ఉండవచ్చు.
Also Read: యాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?
సురేష్ బొబ్బిలి సంగీతంలో 'కళింగ రాజు'
'కళింగ రాజు' చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీలోనూ, సోషల్ మీడియాలోనూ, మీమ్ పేజీల్లోనూ ఎక్కడ చూసినా 'సంప్రదాయని సుద్దపూస' సాంగ్ వైరల్ అవుతోంది. ఆ 'నైంటీస్' వెబ్ సిరీస్‌తో సురేష్ బొబ్బిలి ట్రెండ్ అవుతున్నారు. పలు హిట్ సినిమాలు చేసిన ఆయన... 'కళింగ రాజు' సినిమాకు గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్ ఇస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాకు చోటా కే ప్రసాద్ ఎడిటర్ కాగా... ఒకవైపు ఛాయాగ్రాహకుడిగా, మరోవైపు దర్శకుడిగానూ సత్తా చాటుతున్న గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రాస్తున్నారు.