నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Telugu Movie 2023). చిత్ర పరిశ్రమలో నరేష్ అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చేస్తున్న చిత్రమిది.
ఇది ఎంఎస్ రాజు తీస్తున్న పెళ్ళి!
మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వంలో 'మళ్ళీ పెళ్లి' సినిమా రూపొందుతోంది. దీనికి రచయిత కూడా ఆయనే. ఇందులో నరేష్ జోడిగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం అందింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి నరేష్ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పున:ప్రారంభించారు.
టీజర్ విడుదలకు వేళాయె!
ఏప్రిల్ 13న 'మళ్ళీ పెళ్లి' టీజర్ (Malli Pelli Movie Teaser) విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఏప్రిల్ 21న, అనగా రేపు ఉదయం 11.11 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read : ఎన్టీఆర్ చాలా ఫ్రెండ్లీ, మూడు గంటలు కథ చెప్పిన కొరటాల - సైఫ్ అలీ ఖాన్
కుటుంబంతో చూసే సినిమా!
సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు. ఆల్రెడీ విడుదల అయిన గ్లింప్స్, ప్రచార చిత్రాల్లో నరేష్, పవిత్ర జోడీ కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. వేసవిలో సినిమా విడుదల కానుంది. కన్నడ టీజర్ సైతం రేపు ఉదయమే విడుదల కానుంది.
Also Read : 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు : జునైద్ సిద్ధిక్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల్ రెడ్డి, సాహిత్యం : అనంత శ్రీరామ్
Pavitra Lokesh Naresh Relationship : నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరులో నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రా లోకేష్ చేసిన హడావిడి అందరికీ ఇంకా గుర్తే. ఆ తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా నరేష్ పోస్ట్ చేసిన లిప్ లాక్ వీడియో అయితే సంచలనం సృష్టించింది. అందువల్ల, 'మళ్ళీ పెళ్లి' సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. వీడియో గ్లింప్స్ విడుదల చేయడానికి ముందు అది లీక్ కావడంతో నిజ జీవితంలో నరేష్, పవిత్ర నిజంగా పెళ్లి చేసుకున్నారని అనుకున్నారంతా. ఆ మధ్య జరిగిన 'ఇంటింటి రామాయణం' సినిమా ప్రెస్‌మీట్‌లో తెలుగు ప్రజలు అందరూ మీ పెళ్లి ఎప్పుడు అని చూస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పెళ్లి అయ్యిందని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఏంటి?' అని ప్రశ్నించగా... ''నేను త్వరలో ప్రెస్ మీట్ పెడతా. రియల్ లైఫ్, రీల్ లైఫ్ ప్రతి వ్యక్తికీ ఉంటుంది. నా జీవితం నేను జీవిస్తా. నేను నమ్మేది అది. ఇప్పుడు ఈ సినిమా విషయాలను డైవర్ట్ చేయాలని అనుకోవడం లేదు'' అని నరేష్ సమాధానం ఇచ్చారు.