ఇప్పుడు బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) హైదరాబాదులో ఉన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా (NTR 30)లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, దర్శకుడు శివ కొరటాల క్రియేట్ చేసిన క్యారెక్టర్ల గురించి సైఫ్ అలీ ఖాన్ మాట్లాడారు.
ఎన్టీఆర్ చాలా ఫ్రెండ్లీ!
జూనియర్ ఎన్టీఆర్ చాలా ఫ్రెండ్లీ అని సైఫ్ అలీ ఖాన్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఛార్మింగ్ అండ్ సూపర్ ప్యాషనేట్ అని చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్న ఎన్టీఆర్ ప్లానింగ్ బావుందని సైఫ్ తెలిపారు. ఇప్పుడు హిందీ స్టార్స్ కూడా రీజనల్ లాంగ్వేజెస్ గురించి ఆలోచిస్తున్నారని వివరించారు.
మూడు గంటలు కథ చెప్పిన కొరటాల!
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వినికిడి. అయితే, తనది వెరీ కూల్ రోల్ అని సైఫ్ చెబుతున్నారు. కొరటాల శివ విజన్ గొప్పదని, తనకు మూడు గంటల పాటు కథ వివరించారని, ఎమోషనల్ గా తాను ఇన్వాల్వ్ అయ్యానని, స్పెల్ బౌండ్ స్క్రిప్ట్ తో సినిమా రూపొందుతోందని సైఫ్ వివరించారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న సినిమాలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు.
Also Read : 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి
ఎన్టీఆర్ అన్నయ్య, కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై రూపొందుతోన్న చిత్రమిది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నాయి.
మార్చి నెలాఖరున హైదరాబాదులో ఎన్టీఆర్ 30 చిత్రీకరణ ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం ముగిసింది. అందులో హీరో మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. రెండో షెడ్యూల్ ఈ సోమవారం మొదలైందని తెలిసింది. రాత్రి వేళల్లో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం అందింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆదివారమే ఆమె హైదరాబాద్ వచ్చారు. సోమవారం జరిగిన చిత్రీకరణలో పాల్గొన్నారని టాక్. సైఫ్ అలీ ఖాన్ కూడా షూటింగులో జాయిన్ అవుతున్నారు. వాళ్ళిద్దరికీ తెలుగులో ఇదే తొలి సినిమా.
Also Read : ఓటీటీలో విడుదలకు 'దసరా' రెడీ - నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి అంటే...
అంచనాలు పెంచిన ఎన్టీఆర్ డైలాగ్!
ఇప్పుడు 'వస్తున్నా' అని ఎవరు చెప్పినా సరే తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ గుర్తు వస్తారని చెప్పడంలో మరో సందేహం అవసరం లేదు. ''అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.... అవసరానికి మించి తను ఉండకూడదు అని! అప్పుడు భయానికి తెలియాలి... తను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఈ సినిమా టీజర్ లో ఆయన చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. అంతే కాదు... సినిమా మీద అంచనాలు పెంచింది.