Sai Dharam Tej: హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తన లవర్ ఎవరో చెప్పేశారు. కానీ ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి, తన హార్ట్ బ్రేక్ అయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. మొన్నటికిమొన్న తాను రోడ్డు ప్రమాదం వల్ల చాలా నేర్చుకున్నానని చెప్పారు. అంతే కాదు అదొక పీడ కల కాదని, అదొక స్వీట్ మెమోరీలా గుర్తుంచుకుంటానని చేసిన సాయి వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హీరో అన్న తర్వాత అతని వ్యక్తిగత  జీవితానికి సంబంధించి ఏం చెప్పినా ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తుంది. అదే తరహాలో సాయి ధరమ్ తేజ్ తన రియల్ లైఫ్ లోని ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


రెజీనా, సయామి అంటే ఇష్టం


ప్రతి ఒక్క రియల్ లైఫ్ లోనూ ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారని, అలా తన లైఫ్ లోనూ ఒకరున్నారని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసిందెవరో కాదు సమంత అని ఆయన తన మనసులోని మాటను చెప్పేశారు. ఆ తర్వాత రెజీనా, సయామి అన్నారు. వారు తన ఫస్ట్ హీరోయిన్ కాబట్టి.. వాళ్లంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక తను లవ్ చేసింది ఎవరన్న విషయానికొస్తే మాత్రం.. 'తిక్క' సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి అని తెలిపారు. ఆమెను తాను చాలా గాఢంగా ప్రేమించానన్నారు. ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తన మనసులో మాట చెప్పానని తెలిపారు. తనకు ఆమె అంటే చాలా ఇష్టమని, ఛాన్స్ ఇస్తే డేటింగ్ చేద్దామన్నట్టు వెల్లడించారు. కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి తన హార్ట్ బ్రేక్ అయిందని సాయి చెప్పారు. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసిందంటూ ఆయన చెప్పుకొచ్చారు.






ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేశా, పవన్‌కు కూడా తెలుసు


ఇది పక్కన పెడితే.. తాను ఇంటర్ లో ఉన్నపుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమించానని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ముందు ఫ్రెండ్స్ గా ఉండేవాళ్లం.. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రేమించడం స్టార్ట్ చేశానన్నారు. సీన్ కట్ చేస్తే.. తాము డిగ్రీ కొచ్చేసరికి తానే దగ్గరుండి ఆ అమ్మాయికి పెళ్లి చేశానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికి తన దగ్గర ఏం లేదని, కేవలం డిగ్రీ మాత్రమే పూర్తి చేశానని తెలిపారు. అలా తన ప్రేమను త్యాగం చేసేశానంటూ నవ్వుతూ చెప్పేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తాను చాలా షేర్ చేసుకుంటానన్న సాయి... ఈ విషయం కూడా ఆయనకు తెలుసని చెప్పారు. ఆయనకే కాదు.. తన ఫ్యామిలీలో అందరికీ తెలుసని వివరించారు.


సోలో బతుకే సో బెటర్..


ఇప్పుడు ఇవన్నీ పక్కనబెట్టి సోలో బతుకే సో బెటర్ అని సాగిపోతున్నానని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. 'సోలో బతుకే సో బెటర్' సినిమా కూడా తన రియల్ లైఫ్ కు దగ్గరగానే ఉంటుందన్న ఆయన.. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ లో ఉన్నానని, సెకండాఫ్ లోకి వెళ్లాలంటే ఓ అమ్మాయి రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ రియలైజేషన్ లోనే ఉన్నానని, ఇంకా లైఫ్ పార్ట్ నర్ కావాలనే ఆలోచన ఇంకా రాలేదని స్పష్టం చేశారు. 


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?