విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తనదైన ముద్ర వేశారు. తండ్రి అడుగుజాడల్లో ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఈ లెగసీని ముందుకు తీసుకు వెళ్లడానికి ఎన్టీ రామారావు కుటుంబంలో మూడో తరం యువకుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వస్తున్నారు. భారతీయ తెరకు సూపర్ హీరో సినిమాతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు.


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ
'అ!' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ, ఆ తర్వాత 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో ఆకట్టుకున్నారు. 'హను మాన్'తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కొట్టారు. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prasanth Varma Cinematic Universe) అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ యూనివర్స్ / ఫ్రాంచైజీ సినిమాతో నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna) కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇందులో ఆయనది సూపర్ హీరో రోల్.






మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి అభిమానుల కల నెరవేరబోయే క్షణాలు వచ్చాయి.


Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి



అక్క తేజస్విని సమర్పణలో మోక్షజ్ఞ మొదటి సినిమా
నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమా పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణ భాగస్వామి. లెజెండ్ ప్రొడక్షన్స్ పతాకం మీద తేజస్విని ఈ చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. ప్రశాంత్ వర్మ సైతం నిర్మాణంలో భాగస్వామి అవుతున్నారని సమాచారం. కానీ, ఆ విషయంలో నిజం లేదని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అందులో నిర్మాతలుగా ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి.


Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?



బాలకృష్ణ దర్శకత్వంలో పరిచయం చేయాలని...
తనయుడు మోక్షజ్ఞను తన దర్శకత్వంలో పరిచయం చేయాలని బాలకృష్ణ ఆ మధ్య అనుకున్నారు. 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999' కథ రెడీ చేశానని, ఆ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని రెండు మూడు సందర్భాల్లో బాలకృష్ణ తెలిపారు. అయితే, ప్రశాంత్ వర్మ తీసుకు వచ్చిన కథ అద్భుతంగా ఉండటంతో ఆయనకు అవకాశం ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


బాలకృష్ణకు భక్తి ఎక్కువ. పురాణాలు, ఇతిహాసాల మీద ఆయనకు బలమైన పట్టు ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మన పురాణ ఇతిహాసాల్లోని దేవుళ్ల స్ఫూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్లు డిజైన్ చేయడంతో... బాలకృష్ణ ఈ సినిమాకు ఓటు వేశారని ఊహించవచ్చు.