హీరోగా 15ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అంటే ఈ రోజుల్లో, ఇప్పుడున్న కాంపిటీషన్ లో మాటలు కాదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్లు కంప్లీట్ చేసుకుని ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా తెరపై చూపించే ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యాడు అక్కినేని నాగ చైతన్య. అక్కినేని అనే బ్రాండ్ మీద కెరీర్ లాగించేయొచ్చు అని చైతూ ఎప్పుడూ అనుకోలేదు... ఓ వైపు అన్నపూర్ణ ప్రొడక్షన్స్, మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయని ఎప్పుడూ రిలాక్స్ కాలేదు. 'జోష్'తో మొదలు పెట్టి రాబోయే 'తండేల్' వరకు డిఫరెంట్ గా కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు చైతన్య. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నాగచైతన్యకు అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ వారసత్వం కూడా ఉంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూడా చైతన్యకు తాతే. విక్టరీ వెంకటేష్ మేనల్లుడిగా చైతూ దగ్గుబాటి ఫ్యామిలీ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నాడు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం హీరోగా 2009 సెప్టెంబర్ 5న 'జోష్' మూవీతో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అప్పట్లో ఆయన్ను మీడియాకు, అభిమానులకు పరిచయం చేస్తూ నాగార్జున ఓ ఫంక్షన్ అరేంజ్ చేశారు. కొత్త హీరో అనే అదురు బెదురు లేకుండా ఆ ఫంక్షన్లో నాగచైతన్య జోష్ చూసి అప్పట్లోనే ఆ కుర్రాడిపై ఓ అంచనాకు వచ్చారు అభిమానులు. ఆ అంచనాలకు తగ్గకుండా తన కెరీర్ లో అన్ని రకాల మూవీస్ చేస్తూ 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు నాగచైతన్య.
స్టార్ కిడ్ అనే బ్రాండ్ తో వచ్చిన జోష్ మూవీ ఫ్యాన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. అయితే చైతన్య గ్రాండ్ ఎంట్రీకి ఆ కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ బాగా సెట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఏమాయచేసావే సినిమా చైతూ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. చైతన్య ఎలాంటి స్టోరీస్ కి సెట్ అవుతారనే విషయంలో ఈ మూవీ ఓ క్లారిటీ ఇచ్చింది. ఆ సినిమాతోనే చైతూ ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆ లవ్ స్టోరీకి ట్రాజెడీ ఎండింగ్ ఉన్నా కూడా మానసికంగా మరింత స్ట్రాంగ్ గా మారి కెరీర్ లో నిలబడ్డాడు చైతన్య. త్వరలో శోభితతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు.
'ఏ మాయ చేసావే' తర్వాత '100 పర్సెంట్ లవ్' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ పర్ఫెక్ట్ లవర్ బాయ్ దొరికాడు అని అనిపించుకున్నాడు చైతన్య. ఆ తర్వాత జానర్ మార్చి 'దడ, బెజవాడ' అంటూ కాస్త మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి ఇబ్బందుల్లో పడినా... తిరిగి మనం మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. 'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరీ'... ఇలా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు చేశాడు చైతూ.
Also Read: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి
సక్సెస్ ఫుల్ హీరోగా ఉంటూ కూడా ఇటీవల 'దూత' అనే ఓ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు చైతన్య. ప్రయోగాలు చేయడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. 'దూత' వెబ్ సిరీస్ సూపర్ సక్సె కావడంతో చైతన్య ప్రయోగం సక్సెస్ అయింది. హీరో అంటే కేవలం వెండితెరకే పరిమితం కాకూడదు, వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులకు మరింత దగ్గర కావొచ్చు అని నిరూపించాడు. ఇప్పుడు 'తండేల్' అనే కొత్త సినిమాతో వస్తున్నాడు నాగ చైతన్య.
కంటెంట్ ఓరియంటెడ్ మూవీ తండేల్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. సాయిపల్లవి ఇందులో హీరోయిన్. ఏపీకి చెందిన మత్స్యకారులను 2018లో పాకిస్తాన్ అరెస్ట్ చేసిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'తండేల్'లో మత్య్సకారుడిగా చైతన్య రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీతో చైతూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడనే అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న తండేల్.. చైతూ 15 ఇయర్స్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నారు.