బాబాయ్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) కోసం 'బింబిసార' (Bimbisara Movie) అబ్బాయ్ కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) స్పెషల్ షో వేశారు. బాలయ్యతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కొంత మంది సినిమాను వీక్షించారు.


'బింబిసార' ఆగస్టు 5న థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. భారీ వసూళ్లు సాధిస్తూ... విజయపథంలో దూసుకు వెళుతోంది. కళ్యాణ్ రామ్ చేసిన తొలి సోషియో ఫాంటసీ చిత్రమిది.


సోషియో ఫాంటసీ చిత్రాలకు నందమూరి ఫ్యామిలీ పెట్టింది పేరు. నందమూరి వంశం మూల పురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనేక పౌరాణిక, జానపద సినిమాలు చేశారు. బాలకృష్ణ కూడా కొన్ని చేశారు. 'బింబిసార' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాతయ్య సినిమాలు, బాబాయ్ చేసిన 'భైరవ ద్వీపం' సినిమా గురించి కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు బాబాయ్‌కు సినిమా చూపించారు.


Balakrishna Appreciated Bimbisara Team : బాలకృష్ణ సినిమా ఎంజాయ్ చేయడమే కాదు... కళ్యాణ్ రామ్ సహా దర్శకుడు వశిష్ఠ, చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారని తెలిసింది. బాలకృష్ణతో పాటు హరికృష్ణ కుమార్తె, కళ్యాణ్ రామ్ సోదరి సుహాసిని... పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరికొంత మంది నందమూరి కుటుంబ సభ్యులు సినిమాను వీక్షించారు.


'బింబిసార' సినిమాకు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు, విమర్శకుల నుంచి మాత్రమే కాదు... ప్రేక్షకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. బాక్సాఫీస్ బరిలోనూ సినిమా భారీ విజయం సాధించింది. 


Bimbisara Worldwide Collections In First Week : తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలో 'బింబిసార' రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వసూళ్లు చూస్తే... రూ. 22.30 కోట్లు ఉన్నాయి. 'లాల్ సింగ్ చడ్డా', 'మాచర్ల నియోజకవర్గం', 'కార్తికేయ 2'... ఈ వారం మూడు సినిమాలు విడుదల అయినప్పటికీ నిన్న రూ. 1.13 కోట్లు వసూలు చేసింది. కొత్త సినిమాలను తట్టుకుని ఆ మాత్రం వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. ఎనిమిదో రోజు వసూళ్లు యాడ్ చేస్తే... రూ. 36. 85 కోట్ల గ్రాస్ (రూ. 23.45 కోట్ల షేర్) వచ్చింది. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటకలో ఎనిమిది రోజుల్లో రూ. 1.53 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 1.87 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 44.44 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. రెండో భాగంలో దేవదత్తుడి పార్ట్ ఎక్కువ ఉంటుందని టాక్. అయితే... ఆయన క్రూరుడైన మహా చక్రవర్తిగా ఆయన చూపించిన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.


Also Read : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!


బింబిసారకు జోడీగా కేథరిన్ కనిపించారు. మరో కథానాయికగా ఎస్సై వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ నటించారు. వాళ్ళిద్దరి పాత్రల నిడివి తక్కువే. అయితే... రెండో భాగంలో వాళ్ళకు ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్వరలో రెండో పార్ట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?