'ఆర్ఆర్ఆర్' (RRR Movie)... మూడు అక్షరాలు! కానీ, ఈ సినిమా ప్రభావం మూడు కాలాల పాటు ఉండేలా ఉంది. ఇటు థియేటర్లు, అటు గూగుల్... ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' గురించే డిస్కషన్. సినిమా విడుదలై నాలుగు నెలలు దాటింది. కానీ, జనాల నోటి నుంచి ఇంకా సినిమా వెళ్ళలేదు. ఏదో ఒక రూపంలో ఇంకా అలా వినిపిస్తూనే ఉంది. లేటెస్టుగా గూగుల్ 'ఆర్ఆర్ఆర్' క్రేజ్ గుర్తించి, ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది.
RRR Movie - Google Search : ఇప్పుడు జనాలకు గూగుల్ విపరీతంగా అలవాటు అయ్యింది. ఏం కావాలన్నా... గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' గురించి అలా కొన్ని కోట్ల మంచి సెర్చ్ చేశారనుకోండి. రీసెంట్‌గా 'ఆర్ఆర్ఆర్' గురించి ఏదైనా సెర్చ్ చేశారా? లేకపోతే ఒకసారి సెర్చ్ చేసి చూడండి... సెర్చ్ బార్ కింద ఒక బైక్, గుర్రం వెళుతూ కనిపిస్తాయి. ఒకసారి బైక్ ముందు వస్తే... మరోసారి గుర్రం ముందు వస్తుంది.
'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నడిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్రం మీద స్వారీ చేశారు. బైకుపై చరణ్, గుర్రంపై ఎన్టీఆర్ వెళుతూ కనిపించిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. నందమూరి, మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఆ సన్నివేశాలు నచ్చాయి. ఆ సీన్స్ గుర్తు చేసేలా... 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదీ సంగతి!
గూగుల్‌కు 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పింది. ''థాంక్యూ గూగుల్... మమ్మల్ని సర్‌ప్రైజ్ చేసినందుకు! అలాగే, ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్'కు ఉన్న పాపులారిటీని గుర్తించినందుకు!'' అని 'ఆర్ఆర్ఆర్' టీమ్ పేర్కొంది. గూగుల్‌లో 'ఆర్ఆర్ఆర్' అని సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ లేదా వీడియో తీసుకుని ''RRR Take Over'' హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని ప్రేక్షకుల్ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ కోరింది.
Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు.
Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!