టి పూనమ్ కౌర్ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని కలిశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ‘‘మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని గౌరవ పూర్వకంగా కలిశాను. చాలా సంతోషంగా ఉంది. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖాదీ తిరంగాను బహూకరించాను. పాకిస్థాన్ లోని గురుద్వారా దగ్గర తీసుకున్న ప్రత్యేకమైన గులకరాళ్ళ బాక్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాను. దానికి ఆయన పేరు కూడా పెట్టారు” అని పూనమ్ పేర్కొన్నారు.


మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి దగ్గర పూనమ్ ఆశీర్వాదం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌తో కలిసి పూనమ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు.


ఇక వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది పూనమ్ కౌర్. ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన పూనమ్ కౌర్ ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిగా నితిన్ నటించిన 'శ్రీనివాస కల్యాణం' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఒకట్రెండు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నా.. అవి ఎప్పటికి రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. 






‘నాతిచరామి’ సినిమాలో పూనమ్ కౌర్: ప్రస్తుతం పూనమ్ కౌర్ 'నాతిచరామి' సినిమాలో నటిస్తున్నారు. ఆమెకు జంటగా హీరో అరవింద్ కృష్ణ నటించారు. సందేశ్ బురి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నాగు గవర దర్శకత్వం వహించారు. జై వైష్ణవి .కె నిర్మాత. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో "దానికి వేసిన ఏడు సంవత్సరాల శిక్ష చాలా తక్కువ. ఎంతో భయంకరంగా ఒక మనిషిని ముక్కలుగా చేసి... మూడు ప్రాంతాల్లో పడేసింది" అని ఓ మహిళా అధికారి డైలాగ్ చెబుతుంటే... జైల్లో ఖైదీగా పూనమ్ కౌర్‌ను పరిచయం చేశారు. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా 'నాతిచరామి'. హైద‌రాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత పాత్రలతో తెరకెక్కించిన సినిమా. అప్పట్లో వై2కె సమస్య కారణంగా ఓ కుటుంబంలో జరిగిన ఘటన ఆధారంగా సినిమా రూపొందించాం అని దర్శకుడు నాగు గవర చెప్పారు. ఈ సినిమాలో కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న తదితరులు  నటిస్తున్నారు. 


Also Read : శ్రీదేవి పెట్టిన ఆ కండిషన్ వల్లే ‘కొండవీటి దొంగ’ ఛాన్స్ మిస్? ‘బాహుబలి’కి మళ్లీ అదే రిపీట్!


Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?