గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'భగవంత్ కేసరి' (NBK 108 Movie Titled Bhagavanth Kesari). 'ఐ డోంట్ కేర్'... అనేది ఉప శీర్షిక. ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. జూన్ 8వ తేదీన... అనగా రేపు టైటిల్ వెల్లడించడానికి ఏర్పాట్లు జరిగాయి. 


ఒకటి రెండు కాదు...
ఏకంగా 108 లొకేషన్లలో...
108 హోర్డింగ్స్ మీద!
జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు (Balakrishna Birthday). దానికి రెండు రోజుల ముందు టైటిల్ వెల్లడిస్తున్నారు. అభిమానులకు రెండు రోజుల ముందు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నారు. అది కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో టైటిల్ అనౌన్స్ చేస్తున్నారు. 108 హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేసేలా ప్లాన్ చేశారు. 


'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ
'భగవంత్ కేసరి' సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భగవంత్ కేసరి (Bhagavanth Kesari) పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పేరును టైటిల్ చేశారు. బాలకృష్ణ 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' టైటిల్ ఖరారు చేశారని, ఆ విషయాన్ని బాలయ్య బర్త్ డేకు అనౌన్స్ చేస్తారని చిత్ర బృందం సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఆల్రెడీ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నారు. అందులో కొత్త లుక్ కనిపించే అవకాశం ఉంది. సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే టైటిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ఘన విజయాలు సాధించనవి ఉన్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 


Also Read తిరుమలలో కృతికి ఆ ముద్దులేంటి? కౌగిలించుకోవడం ఏమిటి? వివాదాస్పదంగా మారిన 'ఆదిపురుష్' దర్శకుడి ప్రవర్తన






'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వాళ్ళిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. ఇంతకు ముందు కొన్నిసార్లు ఈ కాంబినేషన్ కొంత మంది దర్శక, నిర్మాతలు పరిశీలనలోకి వచ్చినా సరే... సెట్ కాలేదు. ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీ లీల ఉన్నారు. బాలకృష్ణకు వరుసకు కుమార్తె అయ్యే పాత్రలో ఆమె నటిస్తున్నారు. బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. శ్రీ లీలకు తండ్రి పాత్ర ఆయనది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు.  



దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 


రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.  


Also Read యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ ను వెనకేసుకొచ్చిన ప్రభాస్