Balakrishna About Akhanda 2 Release Date: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో పాన్ ఇండియా రేంజ్ అవెయిటెడ్ మూవీ 'అఖండ 2'. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కుతుండగా ఈ నెల 25న రిలీజ్ అవుతుందని ముందు అనౌన్స్ చేసినా వాయిదా పడింది. తాజాగా రిలీజ్ డేట్‌పై బాలయ్య హింట్ ఇచ్చారు.

Continues below advertisement


తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య 'అఖండ 2' రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. అయితే, ఏ తేదీన రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. డిసెంబర్ 5 శుక్రవారం కావడంతో అదే రోజున రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అదే రోజున రిలీజ్ అవుతుందో లేదా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.






Also Read: ఘాటీ ట్విట్టర్ రివ్యూ: కాటేరమ్మ కూతురు నరికినట్లు... అనుష్క యాక్షన్ విశ్వరూపం... కానీ మూవీకి మిక్స్డ్ టాక్!?


ఇప్పటికే బాలయ్య డబ్బింగ్ పార్ట్ ఫినిష్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండగా... వీఎఫ్ఎక్స్ పనులు కూడా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆడియన్స్‌కు బాలయ్య పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు టైం కావాల్సి ఉన్నందున వాయిదా వేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. మూవీ టీం క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించింది.


ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ఆది పినిశెట్టి విలన్‌ రోల్ చేస్తున్నారు. '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్‌ను బోయపాటి రూపొందించారట. ఆధ్యాత్మికం, సనాతన ధర్మం, సామాజిక అంశాలు, గంజాయిపై ఉక్కుపాదం, యువతకు మంచి సందేశం ఇలా అన్నీ అంశాలు కలగలిపి మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. తమన్ బీజీఎం, బాలయ్య డైలాగ్స్, భారీ వీఎఫ్ఎక్స్, మంచు కొండల్లో యాక్షన్ సీక్వెన్స్‌తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 


ఓటీటీ బిగ్ డీల్


బాలయ్య, బోయపాటి అంటేనే హిట్ కాంబో. సింహ, లెజెండ్, అఖండ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో 'అఖండ 2'కు రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.85 కోట్లకు ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల తెలుగు సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ ఇదేనని ఫిలింనగర్ వర్గాల టాక్.