Anushka Shetty Ghaati Movie Review In Telugu: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో క్వీన్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా 'ఘాటీ'. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి, సినిమా టాక్ ఏంటి? ఆల్రెడీ సినిమా చూసిన జనాలు ఏమని ట్వీట్స్ చేశారు? టాక్ ఎలా ఉంది? అనేది చూడండి 

Continues below advertisement


కాటేరమ్మ కూతురు నరికినట్లు!
'ఘాటీ'లో అనుష్క యాక్షన్ విశ్వరూపం చూస్తారని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొన్ని రోజుల నుంచి చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప', కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజీఎఫ్', రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' తరహాలో యాక్షన్ సీన్లు చేశారని ఇండస్ట్రీ నుంచి లీక్స్ వచ్చాయి. అందుకు తగ్గట్టు సినిమాలో యాక్షన్ ఉందట. 


'సలార్'లో కాటేరమ్మ రాలేదు గానీ కొడుకును పంపించింది సీన్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాటేరమ్మ కొడుకు ఫైట్ పిచ్చ వైరల్. ఆ సీన్ తరహాలో 'ఘాటీ'లో ఓ యాక్షన్ సీన్ ఉందట. కాటేరమ్మ కూతురుకు మినీ వెర్షన్ అన్నట్టు ఫైట్ ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరొకరు అయితే కాటేరమ్మ అని పేర్కొన్నారు.


Also Read: శివకార్తికేయన్ 'మదరాసి' వర్సెస్ అనుష్క 'ఘాటీ'... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్?










సినిమాకు మిక్స్డ్ టాక్? బాలేదా!?
అనుష్క శెట్టి యాక్షన్ విశ్వరూపం 'ఘాటీ' అని నెటిజనులు కొందరు పేర్కొంటే... సినిమాకు సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ లభించింది. ముఖ్యంగా లండన్ షోస్ నుంచి నెగిటివ్ రివ్యూ వచ్చింది.


శీలావతిగా అనుష్కను చూడలేమని, ఇంటర్వెల్ వరకు భరించడం కష్టమని, కథ ప్రెడిక్టబుల్‌గా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. సెకండాఫ్ ఎక్కువగా యాక్షన్ మీద నడిచిందట. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ బోరింగ్ అని పేర్కొన్నాడు. అనుష్క నటన, సంగీతం బావున్నాయట. గంజాయి ఎపిసోడ్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే బావుండేదని చెప్పుకొచ్చాడు. సినిమాకు 2 రేటింగ్ ఇచ్చాడు. 










మరొక నెటిజన్ కూడా సినిమా ఆసక్తికరంగా ప్రారంభం అయినప్పటికీ ఇంటర్వెల్ వరకు ఒక్క విజిల్ వర్తీ మూమెంట్ లేదని చెప్పాడు. సెకండాఫ్ బావుందని, చాలా మాస్ మూమెంట్స్ ఉన్నాయని తెలిపారు. అయితే మాస్ డైలాగ్స్ చెప్పేందుకు స్వీటీ అనుష్క వాయిస్ సరిపోలేదన్నాడు. కాటేరమ్మ కొడుకు ఫైట్ మూమెంట్ నిజంగా చేశారని, సినిమాకు 2.25 రేటింగ్ ఇచ్చాడు.


Also Read'ఓజీ'తో రికార్డుల వేట మొదలు... పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ - అమెరికాలో వసూళ్ల విధ్వంసం










సినిమా బావుందని చెప్పిన నెటిజన్స్ కూడా ఉన్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మంచి సినిమా తీశారని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుష్క షో నడిచిందని ఒకరు ట్వీట్ చేశారు. స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేదని అన్నాడు. సినిమాకు 3 రేటింగ్ ఇచ్చాడు. 'ఘాటీ' క్లైమాక్స్ ఫుల్ మీల్స్ పెడుతుందని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. ఇదొక రివల్యూషనరీ రివేంజ్ డ్రామా అని చెప్పాడు. మొత్తం మీద సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.