నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) పెద్ద కర్మ సాక్షిగా నందమూరి కుటుంబంలో గొడవలు, కుటుంబ కథానాయకుల మధ్య విబేధాలు బయట పడ్డాయా? కెమెరా కంటికి చిక్కాయా? అంటే... 'అవును' అని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు, ఈ కొత్త వివాదానికి కారణం ఏమిటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడినా!
తారక రత్న పెద్ద కర్మకు నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్ (NT Rama Rao Jr), కళ్యాణ్ రామ్ (Kalyan Ram Nandamuri) అటెండ్ అయ్యారు. ఆ కార్యక్రమంలో వాళ్ళిద్దర్నీ నట సింహం నందమూరి బాలకృష్ణ పట్టించుకోలేదు. తారక రత్న ఆస్పత్రిలో ఉన్నప్పటి నుంచి దివంగత లోకాలకు వెళ్ళే వరకూ... ప్రతి అడుగులో అన్నీ తానై బాలకృష్ణ వ్యవహరించారు. పెద్ద కర్మ ఏర్పాట్లు కూడా ఆయన దగ్గరుండి మరీ చూసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ దగ్గరకు వెళ్లి పలకరించారు. ఆయన తమ దగ్గరకు వచ్చిన సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడ్డారు. అయితే, వాళ్ళను బాలకృష్ణ పలకరించకుండా పక్కకి వెళ్ళిపోయారు.
అబ్బాయిలను అవమానించిన బాలకృష్ణ
బాబాయ్ వచ్చారని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడి గౌరవం ఇస్తే... వాళ్ళను అవాయిడ్ చేయడం ద్వారా అబ్బాయిలను బాలకృష్ణ అవమానించారని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఈ విషయంలో ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా వాళ్ళకు మద్దతు లభిస్తోంది. నిన్న మొన్నటి వరకు 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ క్రెడిట్ తమ హీరోది అంటే తమ హీరోది అని సోషల్ మీడియాలో కొట్టుకున్న ఫ్యాన్స్ అందరూ ఒక్కటై బాలకృష్ణ తీరును ఎండగడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇదే. దీనిపై నందమూరి కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి కుటుంబంలో కొంత మందికి ఇష్టం లేదని, ఆయన్ను దూరం పెట్టారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అందుకు తాజా వీడియో ఓ ఉదాహరణ అని ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అదీ మ్యాటర్.
Also Read : పెళ్లి కూతురిని పరిచయం చేసిన మంచు మనోజ్ - వెడ్డింగ్ ఫోటోలు చూశారా?
తారక రత్న ఫిబ్రవరి 18వ తేదీన బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 22 రోజుల పాటు ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. నందమూరి, నారా ఫ్యామిలీలు తమ కుటుంబ సభ్యుడి ప్రాణం కాపాడటం కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే, విధి ఆయన్ను పై లోకాలకు తీసుకు వెళ్ళింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు తారకరత్న స్వయానా మనవడు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమారుడు. ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది.